మూల కణాలతో కీళ్ల సమస్యలకు చెక్
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:18 PM
కీళ్ల నొప్పులకు, కీళ్ల మార్పిడి చిట్టచివరి పరిష్కారం అనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే పరిస్థితి అక్కడి వరకూ వెళ్లకుండా అరికట్టే ఆధునిక చికిత్సలు అందుబాటులోకొచ్చాయి.
కీళ్ల నొప్పులకు, కీళ్ల మార్పిడి చిట్టచివరి పరిష్కారం అనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే పరిస్థితి అక్కడి వరకూ వెళ్లకుండా అరికట్టే ఆధునిక చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. వాటిలో ప్రధానమైనది రీజెనరేటివ్ మెడిసిన్. మూల కణాలతో కీళ్లలోని మృదులాస్థినీ, కణజాలాన్నీ సహజసిద్ధంగా వృద్ధి చేసే ఈ చికిత్సతో కీళ్ల సమస్యలను తొలగించుకోవచ్చు అంటున్నారు రీజెనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ వెంకటేష్ మొవ్వ.
కీళ్ల నొప్పులకు, కీళ్ల మార్పిడి చిట్టచివరి పరిష్కారం అనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే
పరిస్థితి అక్కడి వరకూ వెళ్లకుండా అరికట్టే ఆధునిక చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. వాటిలో ప్రధానమైనది రీజెనరేటివ్ మెడిసిన్. మూల కణాలతో కీళ్లలోని మృదులాస్థినీ, కణజాలాన్నీ సహజసిద్ధంగా వృద్ధి చేసే ఈ చికిత్సతో కీళ్ల సమస్యలను
తొలగించుకోవచ్చు అంటున్నారు రీజెనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ వెంకటేష్ మొవ్వ. పిఆర్‌పికి శాస్త్రీయ ఆధారాలు లేవు
శాస్త్రీయంగా నిరూపణ అయిన చికిత్సలనే వైద్యులు అనుసరించాలి. కానీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేని కొన్ని చికిత్సలు ప్రస్తుతం ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్లాస్మా రిచ్ ప్లేట్‌లెట్ చికిత్సతో కీళ్లలోని మృదులాస్థి పెరిగినట్టు ప్రపంచంలో ఎక్కడా మనుషుల మీద అధ్యయనాలు జరిగిన ఆధారాలు లేవు. ఇప్పటివరకూ ప్రచురితమైన అధ్యయనాల్లో కూడా ఎక్కడా ఇది కనిపించదు. కానీ చికిత్స ముందూ తర్వాతా చేపట్టిన ఎమ్మారై పరీక్షల్లో, కేస్ స్టడీ్‌సలో మూల కణాలతో మృదులాస్థి పెరుగుతున్నట్టు నిరూపణ అయింది. కాబట్టి ఒకవేళ ఎవరైనా పిఆర్‌పి చికిత్సతో మృదులాస్థి పెంచగలుగుతామని పేర్కొంటున్నప్పుడు, ఈ విషయాన్ని నిర్థారించే అధ్యయనాలు ఇప్పటివరకూ ఎన్ని ప్రచురితమయ్యాయో చూపించమని అడగాలి. పిఆర్‌పిలో గ్రోత్ ఫ్యాక్టర్లే తప్ప సజీవ మూల కణాలు ఉండవు కాబట్టి, ఈ చికిత్స కేవలం ప్రారంభ ఆర్థ్రయిటిస్, టెండనైటిస్, టెండనోసిస్ లాంటి వాటికే ఉపయోగపడుతుంది.
కీళ్లకు కండరాలే దన్ను
ముఖ్యంగా మోకీళ్లే అరిగిపోతూ ఉండడానికీ, ఎముకలు తేలికగా విరిగిపోవడానికీ కారణం వాటికి కండరాలు దన్నుగా మారకపోవడమే! కండరాల క్షీణత కచ్చితంగా ఎముకల అరుగుదలకు దారి తీస్తుంది. చీరలు కట్టుకునే గృహిణులు దూరంగా అడుగులు వేస్తూ నడవలేరు. దాంతో కాళ్ల కండరాలు కీళ్లకు ఆసరానివ్వవు. వ్యాయామాలు చేయని వాళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి జీవనశైలిని కొనసాగించేవాళ్ల కీళ్లు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే వ్యాయామానికి దైనందిన జీవితంలో చోటు కల్పించాలి. నడకతో కాలి కండరాలు బలపడి, కీళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఎముకలు, కీళ్లు దృఢంగా మారడానికి బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి. గుండె వేగాన్ని పెంచే కార్డియాక్ వ్యాయామాలతో పాటు కొంత వెయిట్ ట్రైనింగ్ చేయాలి. బరువును అదుపులో పెట్టుకోగలిగే ఆహార నియమాలు పాటించాలి.
డాక్టర్ వెంకటేష్ మొవ్వ
మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్,
రీజెన్ ఆర్థో స్పోర్ట్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్.