Share News

ఇలా చేస్తే యాడ్స్‌ నుంచి తప్పించుకోవచ్చు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:13 AM

విండోస్‌ 11లో ఈ నెల మొదటి నుంచి స్టార్ట్‌ మెనూ యాడ్స్‌పై టెస్టింగ్‌ ఆరంభమైంది. కొంతమంది యూజర్లకు ఈ యాడ్స్‌ దాడి అస్సలు తెలియదు

ఇలా చేస్తే యాడ్స్‌ నుంచి తప్పించుకోవచ్చు

విండోస్‌ 11లో ఈ నెల మొదటి నుంచి స్టార్ట్‌ మెనూ యాడ్స్‌పై టెస్టింగ్‌ ఆరంభమైంది. కొంతమంది యూజర్లకు ఈ యాడ్స్‌ దాడి అస్సలు తెలియదు. ఈ వారంలో యూజర్ల చెంతకు తాజా అప్డేట్‌ చేరుతోంది. రికమెండెడ్‌ విభాగంలో ఒక పార్ట్‌గా ఈ యాడ్స్‌ కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్‌ తాజా అప్డేట్‌లో భాగం ఈ పర్సనలైజ్డ్‌ ప్రకటనలు. ‘ద వెర్జ్‌’ రిపోర్ట్‌ ప్రకారం ఇప్పటికిది టెస్టింగ్‌లో ఉంది. మైక్రోసాఫ్ట్‌ సైతం సపోర్ట్‌ పేజీలో ఈ విషయాన్ని వెల్లడించింది.

కొందరు యూజర్లకు ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యాడ్స్‌ తాకిడిని తట్టుకోలేని యూజర్లు వీటిని ఇలా డిజేబుల్‌ చేసుకోవచ్చు.

ఫ స్టార్ట్‌మెనూపై క్లిక్‌ చేయాలి. సెట్టింగ్స్‌ యాప్‌ను కనుగొని దానిపై కూడా క్లిక్‌ చేయాలి. తదుపరి పర్సనలైజేషన్‌పై క్లిక్‌ చేయాలి.

ఫ పర్సనలైజేషన్‌ మెనూలో స్టార్ట్‌పై క్లిక్‌ చేయాలి.

ఫ షో రికమెండేషన్స్‌ ఫర్‌ టిప్స్‌, యాప్‌ ప్రమోషన్స్‌, మోర్‌ టైటిల్‌ కింద ఉన్న వాటిలో నాలుగో ఆప్షన్‌ను కనుగొని దాని టోగెల్‌ను టర్నాఫ్‌ చేయాలి. అంతే ప్రకటనలు ఇక రావు.

Updated Date - Apr 27 , 2024 | 12:13 AM