Share News

బ్లౌజ్‌ మేనియా!

ABN , Publish Date - Oct 23 , 2024 | 10:54 PM

పండగ వచ్చిదంటే కొత్త ట్రెండ్స్‌ కోసం మహిళలందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పండగకు రకరకాల బ్లౌజ్‌ డిజైన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. ఆ డిజైన్స్‌ ఏమిటో.. అవి ఎలాంటి చీరలపై ధరించటానికి పనికొస్తాయో చూద్దాం..

బ్లౌజ్‌ మేనియా!

పండగ వచ్చిదంటే కొత్త ట్రెండ్స్‌ కోసం మహిళలందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పండగకు రకరకాల బ్లౌజ్‌ డిజైన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. ఆ డిజైన్స్‌ ఏమిటో.. అవి ఎలాంటి చీరలపై ధరించటానికి పనికొస్తాయో చూద్దాం..

మిర్రర్‌ వర్క్‌ బ్లౌజ్‌లు

బ్లౌజ్‌లపై అద్దాలను కుట్టడం ఒకప్పటి ప్యాషన్‌. మళ్లీ అది ఒక ట్రెండ్‌గా మారింది. ఈ బ్లౌజ్‌లను చీరలపైనే కాకుండా లెహంగాలపై కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్‌లు కుట్టించుకోవటానికి అనువైన బ్లైజ్‌ పీస్‌లు మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి.

డోరీ బ్లౌజ్‌

పార్టీలకు వెళ్లినప్పుడు- అందరిని ఆకర్షించటానికి వేసుకొనే బ్లౌజ్‌ ఇది. దీనిని ఏ చీర మీద ధరించినా బావుంటుంది.

ఫుల్‌ స్లీవ్‌ బ్లౌజ్‌

ఈ బ్లౌజ్‌ వేసుకుంటే హుందాతనం దానంతట అదే వచ్చేస్తుంది. వీటిని చీరలపైనే కాకుండా లెహంగాలపై కూడా ధరించవచ్చు. కొందరికి చేతులపై చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. ఇలాంటి వారు ఈ బ్లౌజ్‌లను ధరిస్తే మచ్చలు బయటకు కనిపించవు. ’’’

కటౌట్‌ బ్లౌజ్‌

నైట్‌ పార్టీలకు ఎక్కువ మంది ఈ డిజైన్‌ను ఎంపిక చేసుకుంటారు. ఈ బ్లౌజ్‌ వేసుకుంటే శరీరాకృతి స్పష్టంగా కనిపిస్తుంది.'

స్వీట్‌హార్ట్‌ బ్లౌజ్‌

ప్రస్తుతం ట్రెండింగ్‌లో బ్లౌజ్‌ డిజైన్‌ ఇది. దీనిపై రకరకాల పూసలు వేసి కుట్టడం కూడా ఒక ప్యాషన్‌గా మారింది. ఇది వయస్సు పైబడిన వారికి కాకుండా అమ్మాయిలకు ఎక్కువగా నప్పుతుంది.

స్పగాటీ స్ట్రాప్‌ బ్లౌజ్‌

ఈ మధ్యకాలంలో చీరలను కూడా రకరకాల పద్ధతులు కడుతున్నారు. వీటికి కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ను జోడిస్తున్నారు. ఇలాంటి చీరలకు ఈ స్పగాటీ స్ట్రాప్‌ బ్లౌజ్‌ నప్పుతుంది.


బ్లౌజ్‌ భలే!

చీర అందమంతా బ్లౌజ్‌ స్టిచింగ్‌లోనే దాగి ఉంటుంది. కాబట్టి బ్లౌజ్‌ కుట్టించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...

కొలతలు కచ్చితంగా: సాధారణంగా బ్లౌజ్‌ కుట్టించాలనుకున్నప్పుడు ఆది బ్లౌజ్‌ టైలర్‌కి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఒంటి తీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి కుట్టించే ప్రతిసారీ కొలతలు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఉపయోగించే బ్రాసరీ కొలతలు, టైలర్‌ కుట్టబోయే బ్లౌజ్‌ కొలతలు మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి.

హుకప్‌ బటన్స్‌: బ్లౌజ్‌ లోపలి నుంచి బ్రాసరీ బయటకు తొంగి చూసే వీలు లేకుండా బ్లౌజ్‌ భుజాల దగ్గర హుకప్‌ బటన్స్‌ కుట్టమని టైలర్‌కు చెప్పాలి.

మ్యాచింగ్‌ బ్లౌజ్‌: చీరతో పాటు వచ్చే బ్లౌజ్‌ పీస్‌కు బదులు విడిగా ఎంచుకోవాలనుకుంటే చీర మెటీరియల్‌తో బ్లౌజ్‌ మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఎంచుకునే లైనింగ్‌ నాణ్యతదై ఉండాలి. లేదంటే ఉతికిన తర్వాత కుంచించుకుపోయి బ్లౌజ్‌ ముడతలు పడే అవకాశాలుంటాయి.

కాంబినేషన్‌: మ్యాచింగ్‌ బ్లౌజ్‌లకు కాలం చెల్లింది. ఇప్పుడంతా డిజైనర్‌ బ్లౌజులదే హవా. అయితే హెవీ ఎంబ్రాయిడరీ పనితనం ఉన్న చీరలకు ప్లెయిన్‌ డిజైనర్‌ బ్లౌజులు, ప్లెయిన్‌ చీరలకు సెక్విన్‌ వర్క్‌ ఉన్న బ్లౌజులు ఎంచుకోవాలి. కంజీవరం పట్టు చీరలకు బ్రొకేడ్‌, సిల్క్‌ లేదా వెల్వెట్‌ వెరైటీ బ్లౌజులను ప్రయత్నించవచ్చు.

Updated Date - Oct 23 , 2024 | 10:54 PM