Share News

Belly dancer : బెల్లీ డ్యాన్స్‌ బ్రహ్మాండంగా...

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:57 PM

కన్న కలల మీద ఆశలు వదిలేసుకునే పరిస్థితి అందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. అయితే ఎంచుకున్న లక్ష్యం నుంచి

Belly dancer : బెల్లీ డ్యాన్స్‌ బ్రహ్మాండంగా...

కన్న కలల మీద ఆశలు వదిలేసుకునే పరిస్థితి అందరి

జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో

ఎదురవుతుంది. అయితే ఎంచుకున్న లక్ష్యం నుంచి

పక్కకు తప్పుకోకుండా ముందుకు

కొనసాగగలిగే ధైర్యం, పట్టుదలలు

ఏ కొందరికో ఉంటాయి. బెల్లీ డ్యాన్సర్‌గా

ఎదిగిన నూపుర్‌ కౌషిక్‌ షా

కథ ఇందుకొక ఉదాహరణ.

వృత్తిపరంగా బెల్లీ డ్యాన్స్‌ అర్టిస్ట్‌ అయిన నూపుర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ద్వారా ఏరియల్‌ ఆర్ట్‌, బెల్లీ డ్యాన్స్‌ బేసిక్స్‌ నేర్పించడం మొదలుపెట్టి క్రమేపీ ఆ కళల్లో నిపుణురాలిగా మారిపోయింది. ప్రస్తుతం నూపుర్‌ ప్రొఫెషనల్‌ బెల్లీ డ్యాన్స్‌ ఆర్టిస్ట్‌గా, ఏరియల్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా హెడ్‌ సెక్రటరీల్లో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. నూపుర్‌ బెల్లీ డ్యాన్స్‌ గురించి మాట్లాడుతూ...‘‘ఎవరైనా బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకోవచ్చు. ఈ కళకు రంగు, ఆకారం, వయసు, జెండర్‌లతో పని లేదు. డ్యాన్స్‌ చేయలేని వాళ్లు కూడా ఈ కళను నేర్చుకోవచ్చు. నేను మొదట్లో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, న్యూట్రిషని్‌స్టగా మారాలనుకున్నాను. అథ్లెట్‌ని కాబట్టి నాకు జిమ్నాస్టిక్స్‌ వచ్చు. బెల్లీ డాన్సింగ్‌ ఇంట్రెస్టింగ్‌గా కనిపించడంతో, నేను దాన్నొక అభిరుచిగా మలుచుకున్నాను’’ అంటూ చెప్తోంది నూపుర్‌. ఆవిడ అభిరుచి కాస్తా కొద్ది కాలంలోనే ప్యాషన్‌గా మారింది. పైగా తాను నివసించే అహ్మదాబాద్‌లో బెల్లీ డ్యాన్స్‌ స్కూల్స్‌ లేకపోవడంతో, పూణేకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం తీసుకోవడం వెనకున్న కారణం గురించి వివరిస్తూ... ‘‘బెల్లీ డ్యాన్స్‌ చేసేటప్పుడు, శరీరంతో అనుసంధానమై, శరీరంలోని ప్రతి కండరం మీదా నియంత్రణ సాధించిన అనుభూతికి లోనవుతూ ఉంటాను. అలాంటి కళను నలుగురికీ పరిచయం చేయాలనే తపన నాలో ఉంది. కాబట్టే పూణేకు వెళ్లిపోవాలని నేను తీసుకున్నది పెద్ద నిర్ణయమే అయినా, నా అభిరుచిని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం ఆ నిర్ణయానికి కట్టుబడక తప్పడం లేదు’’ అని చెప్పుకొచ్చింది నూపుర్‌.

'

ప్రమాదం అడ్డంకి కాలేదు

ఏరియల్‌ డ్యాన్స్‌ అనేది ఆధునిక నృత్యంలో భాగం. తాడును ఆధారంగా చేసుకొని, గాలిలో చేసే విన్యాసాలివి. ఇందులో పరిణతి సాధించాలనే తపనతో ముంబయికి వెళ్లాలని నిర్ణయించుకున్న నూపుర్‌ ఓ పక్క పూణేలో విద్యార్థులకు బెల్లీ డ్యాన్స్‌ నేర్పిస్తూనే మరో పక్క వారంలో మూడు సార్లు ముంబయికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. ‘‘అలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపడం తేలిక కాదు. అలా ఆరు నెలలు రెండు నగరాల మధ్యా పరుగులు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత, నా శరీరం సహకరించడం మానేసింది. దాంతో ఆరు నెలల పాటు బ్రేక్‌ తీసుకుని, ముంబయిలో జరిగిన ఏరియల్‌ ఛాంపియన్‌షి్‌పలో పాల్గొన్నాను. నా ఆర్ట్‌ఫామ్‌ను మెచ్చిన జడ్జిలు తొలి మూడు స్థానాల్లో నాకు చోటు కల్పించారు. అది మర్చిపోలేని అనుభవం. అయితే ఆ తర్వాత కొంత కాలానికే ఊహించని ప్రమాదం జరిగింది. ఒక ప్రదర్శనలో నేను ఎత్తు నుంచి పడిపోయి గాయపడ్డాను. నా కాలర్‌బోన్‌ విరిగిపోయింది. దాంతో ఇక ముందు నేను ఏరియల్‌ డ్యాన్స్‌ చేయలేనని డాక్టర్లు చెప్పేశారు. కానీ రెండేళ్ల రిహ్యాబిలిటేషన్‌ తర్వాత, తిరిగి నాకెంతో ఇష్టమైన ఏరియల్‌ డ్యాన్స్‌ సాధన చేయడం మొదలుపెట్టాను. అలాగే జి టివిలో డ్యాన్స్‌ విత్‌ మిలో కూడా పాల్గొన్నాను. నాకు ఈ కళంటే ఇష్టం. దీన్నుంచి తప్పుకోవాలని నేనెప్పుడూ అనుకోను. ఏరియల్‌ డ్యాన్స్‌ పరంగా నాకు రెండో ఆలోచన అంటూ ఉండదు. నాకు ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి కూడా ఇదే!’’ అంటూ చెప్పుకొచ్చింది నూపుర్‌. అంతిమంగా నూపుర్‌ తాను ఆశించిన గుర్తింపును దక్కించుకోగలిగింది. ప్రస్తుతం ఆవిడ ఎన్నో టివి షోల ద్వారా ప్రపంచవ్యాప్త విద్యార్థులకు బెల్లీ డ్యాన్స్‌, ఏరియల్‌ డ్యాన్స్‌ నేర్పిస్తోంది.

Updated Date - Feb 07 , 2024 | 10:57 PM