Share News

అజీర్తికి ఆయుర్వేదం చిట్కాలు!

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:36 AM

కొందరికి అజీర్తి ఎప్పుడూ ఉంటుంది. దీని వల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ క్రింది ఆహార పదార్థాలు తింటే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం..

అజీర్తికి ఆయుర్వేదం చిట్కాలు!

కొందరికి అజీర్తి ఎప్పుడూ ఉంటుంది. దీని వల్ల వారు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ క్రింది ఆహార పదార్థాలు తింటే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం..

బాదంపప్పు

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం బాదంపప్పులకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. వీటిలో అజీర్తిని తగ్గించే గుణం ఒకటి. కేవలం అజీర్తి తగ్గించటమే కాకుండా నాడీ వ్యవస్థను ఉత్తేజపరచటంలో బాదంపప్పు ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందువల్లే ప్రతి రోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పులను తినమని ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు.

తగినంత నూనె

ఆహారంలో తగినంత నూనె, కొవ్వులు లేకపోతే అజీర్తి చేసే అవకాశముంది. అందువల్ల ఆహారంలో నూనెలను తప్పనిసరిగా ఒక భాగం చేయాలి. నువ్వుల నూనె, నెయ్యి, ఆలీవ్‌ నూనెలను తగిన మోతాదుల్లో తీసుకుంటే అజీర్తి సమస్య దూరం అవుతుంది. చాలా ప్రాంతాల్లో అజీర్తి సమస్య నివారణకు ఆముదాన్ని వాడతారు.

పళ్లు

బాగా ముగ్గిన అరటిపళ్లు, యాపిల్స్‌, బొప్పాయి వంటి వాటి వల్ల అజీర్తి దూరం అవుతుంది. సాధారణంగా పళ్లను ఆహారాన్ని తినే ఒక గంట ముందు కానీ తిన్న ఒక గంట తర్వాత కానీ తీసుకోవాలి.

ఇంటింటి చిట్కాలు

ఆయిర్వేద శాస్త్ర ప్రకారం వాతదోషం వల్ల అజీర్తి కలుగుతుంది. ప్రతి ఇంట్లో ఉపయోగించే వెల్లుల్లి, ఉప్పుల వల్ల అజీర్తి చాలా వరకు తగ్గుతుంది. ఇంగువ వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.

Updated Date - Feb 15 , 2024 | 04:36 AM