Share News

గృతుపాత్ర న్యాయం

ABN , Publish Date - May 07 , 2024 | 12:33 AM

ఆందోళనను ఆయుర్వేదంలో ‘గృతుపాత్రన్యాయం’ అంటారు. మనసు ఆందోళనకు గురైతే శరీరం కూడా ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు ఒక చల్లటి పాత్రలో వేడి నూనె పోస్తే.. పాత్ర వేడెక్కుతుంది.

గృతుపాత్ర న్యాయం

ఆందోళనను ఆయుర్వేదంలో ‘గృతుపాత్రన్యాయం’ అంటారు. మనసు ఆందోళనకు గురైతే శరీరం కూడా ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు ఒక చల్లటి పాత్రలో వేడి నూనె పోస్తే.. పాత్ర వేడెక్కుతుంది. అదే వేడిగా ఉన్న పాత్రలో చల్లటి నూనె పోస్తే పాత్ర చల్లబడుతుంది. మనసు, శరీరం కూడా అంతే.

ఒకటి సరిగా లేకపోతే మరొకటి ఇబ్బందికి గురవుతుంది. శరీరం, మనసు ఒకదానికొకటి పాడు చేసుకుంటాయి. ఈ మనో దోషాలవల్ల రజస్సు, తమస్సు పెరిగిపోతాయి. సత్వం స్థిరంగా ఉంటుంది.

రజస్సు, తమస్సువల్ల అది కూడా అస్తవ్యస్తమవుతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. రాత్రి పూట సరిగా నిద్ర పట్టదు. చిన్న విషయానికే చికాకు పడుతుంటారు.

ఈ టెన్షన్‌, కోపం, చికాకు జీర్ణవ్యవస్థ మీద పడుతుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. తద్వార గ్యాస్ట్రిక్‌ సమస్య వస్తుంది. ఇలా.. ఒకదానికొకటి సమస్యలు చుట్టుముడతాయి. కొన్నిసార్లు వాంతి అవుతున్నట్లుగా అసహనంగా అనిపిస్తుంది.

స్థూలంగా చూస్తే ప్రశాంతంగా ఉండలేరు. స్థితప్రజ్ఞత ఉండదు. ఒత్తిడివల్ల ఆందోళన కలుగుతుంది. కొన్ని రకాల మందులు వాడేవాళ్లలోనూ ఇలాంటి సమస్య వస్తుంది. ఆయుర్వేద వైద్యుల వద్దకు వెళ్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Updated Date - May 07 , 2024 | 12:33 AM