Share News

Refrigerator: పాలు, పెరుగు సరే.. మార్కెట్ నుంచి రాగానే ముందు ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టండి!

ABN , Publish Date - Feb 06 , 2024 | 08:43 PM

మార్కెట్‌లో కొనుక్కుని తెచ్చుకునే కొన్ని వస్తువులు చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టరు. అసలు వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలనే చాలా మందికి తెలీదు. మరి అవెంటే ఓసారి చూద్దాం.

Refrigerator: పాలు, పెరుగు సరే.. మార్కెట్ నుంచి రాగానే ముందు ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టండి!

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రిజ్‌లో ఏ వస్తువులు పెట్టాలి అంటే పాలు, పెరుగు, కూరలు అంటూ ఠక్కున ఓ జాబితా చదివేస్తాం. ఇంట్లో పెద్దవాళ్ల నుంచి ఈ విషయాలు నేర్చుకుంటాం కాబట్టి టకటకా పని కానిచ్చేస్తాం. అయితే, మార్కెట్‌లో కొనుక్కుని తెచ్చుకునే కొన్ని వస్తువులను చాలా మంది ఫ్రిజ్‌లో పెట్టరు. అసలు వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలన్న విషయమే చాలా మందికి తెలీదు. మరి అవేంటో ఓసారి చూద్దాం (5 Surprising Foods You Should Refrigerate).


గింజలు, విత్తనాల్లాంటి వాటిని ఫ్రిజ్ పెట్టాలని చాలా మందికి తెలీదు. కానీ, వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో రకరకాల నేచురల్ ఆయిల్స్ ఉంటాయి. వీటిని అలా బయటే వదిలేస్తే కుళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో దాస్తే చాలా రోజుల పాటు నిలవ ఉంటాయి.

గోధుమ పిండిని కూడా ఫ్రిజ్‌లో పెట్టాలి. వినడానికి కాస్తంత వింతగా ఉన్నా ఇది నిజం. గోధుమలోనూ నేచురల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గాల్లో తేమ, వేడి అధికంగా ఉండే చోట్లలో ఈ పిండి త్వరగా పాడయ్యే అవకాశం ఉందట. కాబట్టి, దీన్ని కూడా ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలను కూడా ఫ్రిజ్‌లో పెట్టడం బెటర్. దీంతో, ఇవి చాలా కాలంపాటు ఫ్రెష్‌గా ఉండి వంటకానికి మంచి సువాసన తెస్తాయి. అయితే, వీటిని పేపర్ టవల్స్‌లో చుట్టి పెడితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

బటర్ పేస్ట్‌ ఉన్న జార్లను కూడా ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. ఓసారి మూత తెరిచాక బాటిల్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. లేని పక్షంలో త్వరగా పాడై చివరకు జేబుకు చిల్లు మిగులుతుందని నిపుణులు చెబుతున్నారు.

పండ్లు లేదా ఇతర స్వీట్ సిరప్ బాటిల్స్‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. సాధారణంగా వీటిని అల్మారాల్లో పెట్టేస్తుంటారు కానీ ఇలా చేస్తే వాటికి త్వరగా బూజు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మేపుల్ సిరప్ బాటిల్ ఒకసారి తెరిచాక ఫ్రిజ్‌లో పెడితేనే మంచిదట. ఫ్రిజ్‌లో అది గడ్డకట్టుకుపోతుందని అనిపిస్తే బయటకు తీశాక కాస్తంత వెచ్చచేస్తే సమస్య ఉండదనేది అనుభవజ్ఞుల సలహా!

Updated Date - Feb 06 , 2024 | 08:52 PM