Share News

Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా.. వినూత్నంగా గూగుల్ డూడుల్

ABN , Publish Date - Jan 26 , 2024 | 09:08 AM

భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని(India Republic Day 2024) పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని(Google Doodle) ప్రదర్శించింది. దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న ఈ డూడుల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. భారత ఖ్యాతిని చాటిచెప్పేలా శుక్రవారం ప్రదర్శించిన డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్‌ ఉన్నాయి.

Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా.. వినూత్నంగా గూగుల్ డూడుల్

ఢిల్లీ: భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని(India Republic Day 2024) పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని(Google Doodle) ప్రదర్శించింది. దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న ఈ డూడుల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. భారత ఖ్యాతిని చాటిచెప్పేలా శుక్రవారం ప్రదర్శించిన డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్‌ ఉన్నాయి. కళాకారిని బృందా జవేరి రిపబ్లిక్ డే పరేడ్‌ను వేర్వేరు స్క్రీన్‌లపై కనిపించేలా ఇందులో ఉంచారు. గుజరాత్‌కు చెందిన కళాకారుడు పార్త్ కొతేకర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గతేడాది గూగుల్ డూడుల్‌ను వివరించడానికి చేతితో కత్తిరించిన పేపర్ ఆర్ట్‌వర్క్‌ను రూపొందించారు.

దేశ ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లోని రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కవాతు బృందం, మోటార్ సైకిల్ రైడర్‌లతో సహా కళాకృతికి ఆ డూడుల్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య మార్గ్‌లో నిర్వహించే సైనికుల కవాతులు ఆకట్టుకుంటుంది. ఉత్సవాల ముగింపు కోసం జనవరి 29న బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది.

Updated Date - Jan 26 , 2024 | 09:09 AM