Share News

Miami Mall Alien: మయామి మాల్ బయట 10 అడుగుల ఏలియన్.. వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇది!

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:24 PM

కొత్త సంవత్సరం సందర్భంగా టీనేజర్స్ అందరూ ఆ షాపింగ్ మాల్ బటయ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అనుకోకుండా ఒక గొడవ ఏర్పడింది. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారి, పెద్ద వివాదం చెలరేగింది. పెద్ద సంఖ్యలో..

Miami Mall Alien: మయామి మాల్ బయట 10 అడుగుల ఏలియన్.. వైరల్ వీడియో వెనుక అసలు కథ ఇది!

Miami Mall Alien: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కొందరు ఫేక్ వీడియోలు సృష్టించడమో, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడమో చేస్తున్నారు. రీసెంట్‌గా ఇలాంటి పరిణామమే ఒకటి చోటు చేసుకుంది. మయామిలోని ఒక షాపింగ్ మాల్ బయట 10 అడుగుల ఏలియన్ కంటపడిందని, దాన్ని పట్టుకోవడం కోసం భారీ స్థాయిలో పోలీసులు దిగొచ్చారని ఒక వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో పూర్తిగా క్లారిటీగా లేకపోవడం, అందులో ఏలియన్ తరహాలోనే ఒక దృశ్యం కనిపించడంతో.. బహుశా ఇది నిజమేనేమో అని అందరూ కంగారుపడ్డారు. అంతేకాదు.. వీడియోని విపరీతంగా షేర్ చేశారు. చివరికి.. ఇదంతా ఫేక్ అని తేలిపోయింది.


నిజానికి.. కొత్త సంవత్సరం సందర్భంగా టీనేజర్స్ అందరూ ఆ షాపింగ్ మాల్ బటయ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అనుకోకుండా ఒక గొడవ ఏర్పడింది. ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారి, పెద్ద వివాదం చెలరేగింది. పెద్ద సంఖ్యలో యువకులు కొట్టుకోవడం, న్యూ ఇయర్ రోజు ఈ గొడవ జరగడంతో.. పరిస్థితుల్ని అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు తరలివచ్చారు. దాదాపు 8 నుంచి 10 పోలీసులు వాహనాలు వచ్చాయి. గొడవ పడిన యువకుల్లో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది.. అక్కడ జరిగిన అసలు సంగతి. అయితే.. ఈ మొత్తం తతంగాన్ని ఎదురుగా ఒక భవనం నుంచి ఒకరు తమ ఫోన్‌లో రికార్డ్ చేసి, ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఎన్నడూ లేని స్థాయిలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండటం చూసి.. బహుశా ఆ షాపింగ్ మాల్ వద్ద 8-10 అడుగుల ఎత్తు ఉన్న గ్రహాంతవాసి సంచరిస్తుందన్న రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఇదే సమయంలో.. ఆ వీడియోలో పోలీసు కార్లు, షాపింగ్ మాల్ మధ్య ఒక పొడవాటి జీవి నడుస్తున్నట్టు కనిపించింది. దీంతో.. నిజంగానే ఏలియన్ అయ్యుండొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. చివరికి.. నటుడు విలియం షాట్నర్ కూడా ఈ వైరల్ వీడియోపై స్పందించాడు. ‘‘గ్రహాంతరవాసులు మయామిలోని మాల్‌ను సందర్శించారా?’’ అని సందేహం వ్యక్తం చేశాడు. అయితే.. ఆ తర్వాత క్లారిటీ వీడియో బయటకొచ్చాక, ఆ పొడవాటి జీవి ఏలియన్ కాదని తేలిపోయింది. పోలీసు ఆఫీసర్లే అక్కడి ఆవరణలో నడుస్తూ.. ఏలియన్స్‌లా కనిపించారని క్లారిటీ వచ్చింది. పోలీసులు సైతం అక్కడ గ్రహాంతరవాసి గానీ, యూఫో గానీ లేదని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Updated Date - Jan 08 , 2024 | 10:24 PM