Share News

Japan SLIM Mission: జపాన్ ‘స్లిమ్’ అద్భుతం.. ఆశలు వదులుకున్న టైంలో ఊహించని చమత్కారం

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:52 PM

చంద్రునిపై విజయవంతంగా కాలుమోపిన జపాన్ మూన్ ల్యాండర్ (Smart Lander for Investigating Moon - SLIM) తాజాగా మరో అద్భుతం నమోదు చేసింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని, తిరిగి ప్రాణం పోసుకుంది. ఈ విషయాన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA - జాక్సా) సోమవారం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆదివారం రాత్రి తాము స్లిమ్‌కు ఒక కమాండ్ పంపించామని, దానికి స్పందన వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది.

Japan SLIM Mission: జపాన్ ‘స్లిమ్’ అద్భుతం.. ఆశలు వదులుకున్న టైంలో ఊహించని చమత్కారం

చంద్రునిపై విజయవంతంగా కాలుమోపిన జపాన్ మూన్ ల్యాండర్ (Smart Lander for Investigating Moon - SLIM) తాజాగా మరో అద్భుతం నమోదు చేసింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని, తిరిగి ప్రాణం పోసుకుంది. ఈ విషయాన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA - జాక్సా) సోమవారం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆదివారం రాత్రి తాము స్లిమ్‌కు ఒక కమాండ్ పంపించామని, దానికి స్పందన వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. సూర్యకిరణాల కోణం మారి, స్లిమ్ బ్యాటరీ మళ్లీ ఛార్జ్ అవ్వడం వల్లే ఈ అద్భుతం జరిగిందని జాక్సా వెల్లడించింది. రాత్రి వేళ కూడా తన కమ్యూనికేషన్‌ సామర్థ్యాన్ని ‘స్లిమ్’ కాపాడుకున్నట్లయ్యిందని చెప్పుకొచ్చింది.


నిజానికి.. జపాన్ మూన్ ల్యాండర్ జనవరి నెలలో చంద్రునిపై ఇబ్బందికర పరిస్థితుల్లో కాలుమోపింది. మామూలు స్థితిలో కాకుండా తలక్రిందులుగా ల్యాండ్ అయ్యింది. ఫలితంగా.. సోలార్ ప్యానెల్స్‌పై ఎండ పడని పరిస్థితి నెలకొంది. అయితే.. సూర్యుని గమనం మారడంతో ఆ ప్యానెల్స్‌పై వెలుగు పడింది. ఫలితంగా.. జపాన్ మూన్ ల్యాండర్ కోలుకొని, అక్కడ కొన్ని ఫోటోలను తీసి భూమికి పంపించింది. అలాగే.. 10 శిలలపై కూడా ప్రయోగాలు చేసింది. ఇంతలోనే చంద్రునిపై రాత్రి మొదలుకావడంతో.. స్లిమ్ నిద్రావస్థలోకి జారుకుంది. ఇక ఇది తిరిగి మేలుకోవడం దాదాపు కష్టమేనని అందరూ భావించారు. ఎందుకంటే.. రాత్రి సమయంలో చంద్రునిపై ఉష్ణోగ్రతలు -200 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి పరిస్థితిని ఇది తట్టుకోవడం కష్టమేనని శాస్త్రవేత్తలు సైతం ఆశలు వదులుకున్నారు. కానీ.. ఈ స్లిమ్ తిరిగి ప్రాణం పోసుకోవడంతో, దీనినో అద్భుత పరిణామంగా పరిగణిస్తున్నారు.

స్లిమ్ తన కమ్యూనికేషన్ సామర్థ్యాలను కొనసాగిస్తూనే.. చంద్రుని ఉపరితలంపై రాత్రిని విజయవంతంగా నావిగేట్ చేసిందని జాక్సా వెల్లడించింది. వాస్తవానికి.. ఈ మూన్ ల్యాండర్‌ను కఠినమైన చంద్ర రాత్రుల్ని తట్టుకుని నిలబడేంత దృఢంగా రూపొందించలేదని, అయినా ఇది తిరిగి మేలుకుందని హర్షం వ్యక్తం చేసింది. చంద్రునిపై ఈ స్లిమ్ జరిపిన పరిశోధనలు.. నావిగేషన్ టెక్నిక్‌ల పురోగతికి ఎంతో దోహదపడతాయని స్లిమ్ మిషన్ బృందం నమ్మకంగా ఉంది. ఇంతకుముందు పలు పరాభావాల్ని ఎదుర్కొన్న జపాన్ అంతరిక్ష సంస్థకు ఈ విజయం ఎంతో ప్రత్యేకమైంది. ఈ స్లిమ్ అక్కడ సక్సెస్‌ఫుల్‌గా కాలుమోపడంతో.. భారత్, చైనా, అమెరికా, రష్యాల తర్వాత చంద్రునిపై ల్యాండ్ అయిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది.

Updated Date - Feb 26 , 2024 | 05:52 PM