Share News

Chicken Heist: ప్రపంచంలోనే అరుదైన దొంగతనం.. ఏకంగా 133 టన్నుల చికెన్ స్వాహా

ABN , Publish Date - Feb 11 , 2024 | 07:29 PM

చోరీలందరూ ఈ చోరీ చాలా అరుదైనది. బహుశా ఇలాంటి విచిత్రమైన దొంగతనం గురించి ఎవ్వరూ విని ఉండరు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 133 టన్నుల చికెన్‌ని దొంగలించిన ఆశ్చర్యకరమైన కేసు ఇది. అసలు అంత భారీ మొత్తంలో చికెన్‌ని ఎందుకు దొంగలించారో తెలుసా?

Chicken Heist: ప్రపంచంలోనే అరుదైన దొంగతనం.. ఏకంగా 133 టన్నుల చికెన్ స్వాహా

చోరీలందరూ ఈ చోరీ చాలా అరుదైనది. బహుశా ఇలాంటి విచిత్రమైన దొంగతనం గురించి ఎవ్వరూ విని ఉండరు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 133 టన్నుల చికెన్‌ని దొంగలించిన ఆశ్చర్యకరమైన కేసు ఇది. అసలు అంత భారీ మొత్తంలో చికెన్‌ని ఎందుకు దొంగలించారో తెలుసా? తినడానికి కాదు.. వాటిని విక్రయించి, వచ్చిన ఆ డబ్బులతో టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేసేందుకు! ఇది చదవగానే మైండ్ బ్లాక్ అయ్యింది కదూ! ఈ దోపిడీ క్యూ దేశంలో చోటు చేసుకుంది.


ఇప్పటికే క్యూబా దేశం.. పేదరికం, ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది. కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిలో అక్కడి ప్రజల బతుకులు మగ్గుతున్నాయి. అలాంటి క్యూ దేశ రాజధాని హవానాలో ఈ భారీ దొంగతనం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ 133 టన్నుల చికెన్‌ని విక్రయించి.. వచ్చిన డబ్బులతో ఆ దొంగలు ల్యాప్‌టాప్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తులను కొనుగోలు చేశారు. ఈ కేసులో 30 మందిపై అభియోగాలు మోపారు. హవానాలోని స్టేట్ ఫెసిలిటీలో ఉన్న 1660 వైట్ బాక్సుల నుంచి ఈ మాంసాన్ని తీసుకెళ్లారు. ఆ దేశంలో ఆహార కొరత ఉంది కాబట్టి.. రేషన్ ప్రకారం చికెన్‌ని అక్కడి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ 133 టన్నుల చికెన్‌ని కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధం చేసి ఉంచారు. కానీ.. ఇంతలోనే దొంగలు పడి, ఈ మొత్తం మాంసాన్ని ఎత్తుకెళ్లారు.

ప్రభుత్వ ఆహార పంపిణీదారు COPMAR డైరెక్టర్ రిగోబెర్టో ముస్టెలియర్ మాట్లాడుతూ.. దొంగిలించబడిన ఈ 133 టన్నుల మాంసం, ఒక ప్రావిన్స్‌కు నెల రోజుల సరిపడా చికెన్‌కి సమానమని తెలిపారు. ఈ దొంగతనం తెల్లవారుజామున 2 గంటల మధ్య జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ దోపిడీ జరగడానికి ముందు.. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల్ని అధికారులు గమనించినట్టు తెలిపారు. ఎవరిమీదైతే అభియోగాలు మోపబడ్డాయో.. ఆ 30 మందిలో ఈ ప్లాంట్‌లోనే పని చేసే షిఫ్ట్ బాయ్స్, ఐటీ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టు తేలింది. అసలు కంపెనీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ దోపిడీలో పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే మాత్రం.. వారికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Updated Date - Feb 11 , 2024 | 07:29 PM