Share News

AP EAPCET Result: ఏపీ ఈఏపీ‌సెట్ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:51 PM

ఏపీ ఈఏపీసెట్ (AP EAP CET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షలు నిర్వహించారు.

AP EAPCET Result: ఏపీ ఈఏపీ‌సెట్ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీ ఈఏపీసెట్ (AP EAP CET) ఫలితాలు విడుదలయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జే.శ్యామల రావు ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో 75.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో అర్హతసాధించిన 70,352 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో 87.11 శాతం ఉత్తీర్ణత సాధించారు.


ఇంజనీరింగ్‌లో ర్యాంకుల విషయానికి వస్తే.. మాకినేని జిష్ణు సాయి ఫస్ట్ ర్యాంకు సాధిచాయి. మురసాని సాయి యశ్వంత్ రెడ్డికి రెండవ ర్యాంకు, భోగలాపల్లి సందీష్‌కి మూడవ ర్యాంకు వచ్చాయి. ఇక అగ్రికల్చర్‌లో ఫస్ట్ ర్యాంక్ యెల్లు శ్రీశాంత్ రెడ్డి (తెలంగాణ), అగ్రికల్చర్‌లో రెండవ ర్యాంక్ పూల దివ్యతేజ, అగ్రికల్చర్‌లో మూడవ ర్యాంక్ వడ్లపూడి ముకేష్ చౌదరిలకు వచ్చాయి.


ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

Updated Date - Jun 11 , 2024 | 06:17 PM