Share News

కొత్త పొంగలి రుచులతో...

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:47 AM

పాతకు గోరీ కడుతూ కొత్తకు భేరీ కొడుతూ భోగి మంటల సయ్యాటలా బ్రతుకు బ్రతుకులో సం‘క్రాంతులు’ రావాలి...

కొత్త పొంగలి రుచులతో...

పాతకు గోరీ కడుతూ

కొత్తకు భేరీ కొడుతూ

భోగి మంటల సయ్యాటలా

బ్రతుకు బ్రతుకులో

సం‘క్రాంతులు’ రావాలి

గంగిరెద్దులు నాట్యమాడినట్టు

బొమ్మల కొలువులు

ముచ్చట గొలిపినట్టు

జంగమ దేవరలు దీవించి నట్టు

పాడి పంటలు పొంగి పొరలే

రైతు సంక్రాంతులు రావాలి

ఇళ్ల ముంగిళ్లలో

ముత్యాల ముగ్గులు మురిసినట్టు

చలిపొద్దు పొడుపులో

సూరీడు ఎర్రబారినట్టు

నవనవొన్మేశంగా

నవ సంక్రాంతులు రావాలి

పడతులు పూల సజ్జలై

పట్టు పరికిణీలు కట్టినట్టు

చెరుకు కంకుల గడలు

తియ్యందనాలను చిమ్మినట్టు

అభి‘రుచుల’ సంక్రాంతులు రావాలి

పిల్లల భోగిపళ్ల ముచ్చటలా

కోడి పందాల కలహాల హేలలా

రథం ముగ్గులో గొబ్బిల్లలా

కొత్త పొంగలి రుచులతో

కొంగ్రొత్తగా సంక్రాంతి రావాలి..!

డా. కటుకోఝ్వల రమేష్

Updated Date - Jan 14 , 2024 | 03:47 AM