Share News

ఎవరు గెలిచినా...!

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:52 AM

ఎన్నికల్లో ఎవరు గెలిచినా... చెత్తపన్ను తీసెయ్యాలి, కరెంటు రేట్లు తగ్గించాలి, ఒకటో తేదీకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, అన్న కాంటీన్లను తెరవాలి. ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు కొట్టెయ్యకూడదు...

ఎవరు గెలిచినా...!

ఎన్నికల్లో ఎవరు గెలిచినా... చెత్తపన్ను తీసెయ్యాలి, కరెంటు రేట్లు తగ్గించాలి, ఒకటో తేదీకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, అన్న కాంటీన్లను తెరవాలి. ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు కొట్టెయ్యకూడదు. మంత్రుల ప్రయాణంలో ట్రాఫిక్ జాం చెయ్యకూడదు. ప్రశ్నిస్తే అరెస్టు చెయ్యరాదు. ఎవరు గెలిచినా... ప్రభుత్వ కార్యాలయాలలో పని త్వరగా జరిగేటట్లు, లంచం తీసుకోకుండా పనులు జరిగేటట్లు ఆదేశాలు ఇవ్వాలి. అలాగే వాస్తు పేరిట జరిగే డబ్బు దుర్వినియోగాన్ని ఆపాలి. దొంగబాబాల ఆశ్రమాల గుట్టు రట్టు చేయాలి. వారికి ఇచ్చిన భూముల జీవో రద్దు చెయ్యాలి. ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలి. ఆశ్రమాల చుట్టూ మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీయస్‌లు తిరగకుండా, లౌకికవాదాన్ని రక్షించాలి. మూఢనమ్మకాల నిర్మూలనకు ఒక చట్టం తీసుకురావాలి.

నార్నె వెంకటసుబ్బయ్య

అధ్యక్షుడు, ఏపీ హేతువాదసంఘం

Updated Date - Jun 04 , 2024 | 12:52 AM