Share News

సందర్‌రాజుకు ఘన నివాళి

ABN , Publish Date - May 31 , 2024 | 12:02 AM

తెలుగు సాహితీవేక్త డాక్టర్‌ నాగప్పగారి సందర్‌రాజు 56వ జయంతి సందర్భంగా గురువారం ఎస్కేయూలో సంతాసభను నిర్వహించారు.

సందర్‌రాజుకు ఘన నివాళి
మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ బాలసుబ్రహ్మణ్యం

అనంతపురం సెంట్రల్‌, మే 30: తెలుగు సాహితీవేక్త డాక్టర్‌ నాగప్పగారి సందర్‌రాజు 56వ జయంతి సందర్భంగా గురువారం ఎస్కేయూలో సంతాసభను నిర్వహించారు. ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమన ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఎస్కేయూ తెలుగు శాఖ విభాగాధిపతి ప్రొఫెసర్‌ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు.


సుందర్‌రాజు తన రచన లతో తెలుగు సాహితీ సంపద సృష్టికర్తగా వెలుగొందారని కొనియాడారు. 1999లో ఎస్కేయూ తెలుగు శాఖ అసిస్టెంట్‌ ప్రొఫసర్‌ పనిచేస్తూ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా రచనలు చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకేహరి, ఓటీడీఆర్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, రామడు, నాగేంద్ర, నాగప్పగారి ఆనంద్‌, ఏఐఎస్‌ఏ నాయకులు బాలకృష్ణ, అరుణ్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:02 AM