Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 01 2024

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:11 AM

‘వేదిక’ సాహిత్య చర్చ , అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కార ప్రధాన సభ, రెండు కవితా సంపుటాల ఆవిష్కరణ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 8 01 2024

‘వేదిక’ సాహిత్య చర్చ

‘వేదిక’ ఆధ్వర్యంలో శైలజ చందు కథ ‘అమృతం’పై చర్చ, నోర ఎఫ్రాన్‌ ఆంగ్ల కథకు స్వప్న పేరి పరిచయం జనవరి 13 సాయంత్రం 7 గంటలకి జరుగుతాయి. వివరాలకు: 81426 42638.

అనిల్‌ అట్లూరి

అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కార ప్రధాన సభ

అలిశెట్టి ప్రభాకర్‌ పురస్కార సభ కరీంనగర్‌ ఫిల్మ్‌ భవన్‌లో జనవరి 12న సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. స్వీకర్త కవయిత్రి తోట నిర్మలారాణి.

తెలంగాణ రచయితల వేదిక

రెండు కవితా సంపుటాల ఆవిష్కరణ

అమ్మంగి వేణుగోపాల్‌ ‘ముఖచిత్రం’, అమ్మంగి కవితా స్వామి ‘ముందడుగు’ కవితా సంపుటాల ఆవిష్కరణ సభ జనవరి 13 మధ్యాహ్నం 1.30గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగు తుంది. సభలో జి. చెన్నకేశవరెడ్డి, నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, టి.వి. నరసింహస్వామి, పి.లక్ష్మీనారాయణ, తిరు నగరి దేవకీదేవి, తదితరులు పాల్గొంటారు.

జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక

Updated Date - Jan 08 , 2024 | 12:11 AM