Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27 05 2024

ABN , Publish Date - May 27 , 2024 | 12:32 AM

పుస్తక సమీక్షా కార్యక్రమం, శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక, ‘గజల్‌ పారడైజ్‌’ ఆవిష్కరణ, వర్తన నాలుగవవ సమావేశం, వెన్నెల సాహితీ పురస్కారం, వాసా ఫౌండేషన్‌ కథల పోటీ ఫలితాలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 27 05 2024

పుస్తక సమీక్షా కార్యక్రమం

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ‘ఎన్‌టిఆర్‌ః100’ శతజయంతి సంచిక, ‘టాంక్‌బండ్‌ విగ్రహాల ప్రశస్తి’ పుస్త కాల సమీక్షా సభ మే 28 ఉదయం 10 గం.లకు ఎన్‌టిఆర్‌ కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి ఎన్‌. జయ ప్రకాశ్‌నారాయణ, అధ్యక్షులు కె. రామచంద్ర మూర్తి, విశిష్ట అతిథి పరుచూరి గోపాల కృష్ణ, గ్రంథ సమీక్ష బీరం సుందరరావు.

తూమాటి సంజీవరావు

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక

శీలా వీర్రాజు స్మారకంగా ప్రతీ ఏటా దీర్ఘ కవి/ రచయిత, చిత్రకారులను సత్కరించ దలిచాం. శీలా వీర్రాజు రెండవ వర్ధంతి సందర్భంగా కవి పుప్పాల శ్రీరాం, ఆర్టిస్ట్‌ అన్వర్‌ శీలావీ పురస్కారాలను అందుకుం టారు. ఈ సందర్భంగా లేపాక్షీ, అజంతా ఎల్లోరా, కోణార్క్‌, రామప్ప శిల్ప చిత్రాలతో కూడిన ‘శీలావీ శిల్పరేఖలు’ పుస్తకావిష్క రణ ఉంటుంది. ఈ కార్యక్రమం జూన్‌ 1 సాయంత్రం 5.30కు హైదరాబాద్‌ రవీంద్ర భారతి మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. పురస్కార గ్రహీత లకు రూ.15 వేల నగదు, జ్ఞాపిక బహూ కరణ ఉంటాయి. కె. శివారెడ్డి, ఎన్‌. గోపి, వాడ్రేవు చినవీరభద్రుడు, నాళేశ్వరం శంకరం, మామిడి హరికృష్ణ పాల్గొంటారు.

శీలా సుభద్రాదేవి

‘గజల్‌ పారడైజ్‌’ ఆవిష్కరణ

ఇనుగుర్తి లక్ష్మణాచారి వ్యాస సంపుటి ‘గజల్‌ పారడైజ్‌’ ఆవిష్కరణ సభ తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో జూన్‌ 1 సాయంత్రం 5.30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైద రాబాద్‌లో జరుగుతుంది. ఆవిష్కర్త ఏనుగు నరసింహారెడ్డి; కృతి స్వీకర్త బి. బాలకృష్ణ; సభాధ్యక్షత అనంతోజు మోహన్‌ కృష్ణ; ముఖ్య అతిథి కె. ఆనందాచారి.

కుసుంబ నిత్య

వర్తన నాలుగవవ సమావేశం

వర్తన సాహిత్య సంస్థ నాలుగవ సమా వేశం మే 28 మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది. ఈ సమావేశంలో ‘తెలంగాణ నవల తీరు తెన్నులు’ అంశంపై కాసుల ప్రతాపరెడ్డి ప్రసంగిస్తారు.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

వెన్నెల సాహితీ పురస్కారం

ఉదారి నారాయణ రచించిన ‘మళ్ళీ మనిషి లోకి’ కవితా సంపుటి వెన్నెల సాహితీ పురస్కారం - 2023కు ఎంపిక అయ్యింది. త్వరలో సిద్దిపేటలో జరుగ బోవు సాహిత్య కార్యక్రమంలో పురస్కార ప్రదానం ఉంటుంది.

వంగర నర్సింహారెడ్డి

వాసా ఫౌండేషన్‌ కథల పోటీ ఫలితాలు

సాహితీకిరణం సౌజన్యంతో వాసా ఫౌండే షన్‌ ‘జాతీయ సమైక్యత’ అంశంపై నిర్వహి ంచిన కథలపోటీ ఫలితాలు: ‘తమసోమా జ్యోతిర్గమయా’ కథకు దుద్దుంపూడి అన సూయ (రాజమహేంద్రవరం) రూ.5వేల ప్రథమ బహుమతి; ‘అరాచకం’ కథకు పి. సత్యప్రకాశరావు (విజయవాడ) రూ.2500 ద్వితీయ బహుమతి. రూ.1000 చొప్పున ప్రత్యేక బహుమతులు అందుకున్నవారు - సి.యస్‌.జి. కృష్ణమాచార్యులు (పుదుచ్చేరి), ఎ.సరళ (హైదరాబాద్‌), సూరిశెట్టి వసంత కుమార్‌ (విజయనగరం) ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు (తిరుపతి), కె.వి. సుమలత (గుడి వాడ). జూన్‌ 6 సాయంత్రం హైదరాబాద్‌ శ్రీత్యాగరాయ గానసభలో బహుమతి ప్రదానం జరుగుతుంది.

పొత్తూరి సుబ్బారావు

Updated Date - May 27 , 2024 | 12:32 AM