Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 21 04 2024

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:30 AM

ఆటా నవలల పోటీ ఫలితం, ‘నీతిచంద్రిక - చిన్నయ గద్యశైలి’ అంశంపై ప్రసంగం, ‘లౌకిక విలువలు - సాహిత్యం’ సదస్సు, ఐదు పుస్తకాల ఆవిష్కరణ...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 21 04 2024

ఆటా నవలల పోటీ ఫలితం, ‘నీతిచంద్రిక - చిన్నయ గద్యశైలి’ అంశంపై ప్రసంగం, ‘లౌకిక విలువలు - సాహిత్యం’ సదస్సు, ఐదు పుస్తకాల ఆవిష్కరణ...

అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన నవలల పోటీలో ఉణుదుర్తి సుధాకర్‌ రచించిన ‘చెదరిన పాదముద్రలు’ నవలకి లక్ష రూపాయిలు బహుమతిగా ఇవ్వాలని ఆటా కార్యవర్గం నిర్ణయించింది. ఈ నవలని ఆటా త్వరలోనే ప్రచురిస్తుంది.

రవి వీరెల్లి

‘నీతిచంద్రిక - చిన్నయ గద్యశైలి’ అంశంపై ప్రసంగం

రాజాం రచయితలవేదిక సమావేశం ఏప్రిల్‌ 28 ఉ.10గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో విద్యానికేతన్‌ పాఠశాలలో జరుగుతుంది. పై అంశంపై ఒమ్మి రమణమూర్తి ప్రసంగిస్తారు.

గార రంగనాథం

‘లౌకిక విలువలు - సాహిత్యం’ సదస్సు

సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వ ర్యంలో ‘లౌకిక విలువలు-సాహిత్యం’ అంశం పై తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు ఏప్రిల్‌ 28న ఉదయం 10గంటల నుంచి సెనేట్‌ హాల్‌, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌లో జరుగుతుంది. ప్రారంభ సమావేశం తర్వాత నాలుగు సెషన్లలో జరిగే సమావేశాలకు యాకూబ్‌, మెట్టు రవీందర్‌, పసునూరి రవీందర్‌, భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిస్తారు. ప్రాంభోపన్యాసం నందిని సిధా రెడ్డి, ముగింపు ఉపన్యాసం ఖాదర్‌ మొహి యుద్దీన్‌ చేస్తారు. అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. ‘ఫాసిస్ట్‌ పోకడలను సాహిత్యం లోకి వస్తువుగా తీసుకురావడం ఎలా?’ అంశంపై నరేష్‌ కుమార్‌సూఫీ, మెర్సీ మార ్గరెట్‌ నిర్వహణలో ప్యానెల్‌ డిబేట్‌ ఉంటుంది.

సమూహ సెక్యులర్‌ రైట్సర్స్‌ ఫోరం

ఐదు పుస్తకాల ఆవిష్కరణ

కొండపల్లి నీహారిణి మూల గ్రంథానికి మరి గంటి లక్ష్మణాచార్యులు హిందీ అనువాదం ‘చిత్రకళా తపస్వి డా. కొండపల్లి శేషగిరిరావు కీ జీవన్‌ గాథా’; కొండపల్లి నీహారిణి రాసిన స్త్రీవాద సాహిత్య విమర్శ సంపుటి ‘అని వార్యం’; మయూఖ అంతర్జాల పత్రిక కథా సంకలనాలు ‘కథా మయూఖం’, ‘బాల కథా మయూఖం’; ఇంకా ధూళిపాళ అరుణ కథా సంపుటి ‘మిగిలేవి గురుతులే’... ఈ ఐదు పుస్తకాల ఆవిష్కరణ సభ ఏప్రిల్‌ 27 ఉదయం 10గంటల నుంచి స్పైసీ హబ్‌ హోటల్‌, కొత్తపేట, హైదరాబాద్‌లో జరుగు తుంది. మాడిశెట్టి గోపాల్‌, ఓలేటి పార్వ తీశం, ఎన్‌. గోపి, నరేంద్రరాయ్‌, వారాల ఆనంద్‌, కొలకలూరి ఇనాక్‌, సి. మృణాళిని, తదితరులు పాల్గొంటారు.

నక్క హరికృష్ణ

Updated Date - Apr 22 , 2024 | 03:30 AM