Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 03 2024

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:19 AM

‘అనల్పం’ కవితా సంపుటి, ప్రపంచ కవితా దినోత్సవసభ, ‘నాగలి కూడా ఆయుధమే..!’, తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాలు, ‘పలకల నుంచి పలుకుల వైపు’...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 18 03 2024

‘అనల్పం’ కవితా సంపుటి

బోధి ప్రచురణలు, తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శేషభట్టర్‌ రఘు కవితా సంపుటి ‘అనల్పం’ ఆవిష్కరణ సభ మార్చి 25 సా.6గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభాధ్యక్షత ఏనుగు నరసింహారెడ్డి; పుస్తకావిష్కరణ సిద్ధార్థ; వక్తలు అంబటి సురేంద్ర రాజు, కొప్పర్తి, ప్రసాదమూర్తి.

బోధి ప్రచురణలు

ప్రపంచ కవితా దినోత్సవసభ

కవిసంధ్య, భాషా సాంస్కృతిక శాఖ సౌజ న్యంతో మార్చి 24 సా.5.30గంటలకి రవీంద్ర భారతి సమావేశ మందిరం, హైదరాబాద్‌లో ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా కవిత్వంపై కొప్పర్తి ప్రత్యేక ప్రసంగం; కవితల పోటీ బహుమతుల ప్రదానం; కవి సంధ్యపత్రిక, కవిత్వ గ్రంథాల ఆవిష్కరణ; కవి సమ్మేళనం ఉంటాయి. శిఖా మణి, కొలకలూరి ఇనాక్‌, కె.శివారెడ్డి, మామిడి హరి కృష్ణ తదితరులు పాల్గొంటారు.

దాట్ల దేవదానం రాజు

‘నాగలి కూడా ఆయుధమే..!’

విల్సన్‌ రావు కొమ్మవరపు కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయు ధమే..!’ పరిచయ సభ మార్చ్‌ 21 సా.4గంటలకు తిరుపతిలోని యూత్‌ హాస్టల్‌ నందు జరుగుతుంది. అధ్యక్షత తోట వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథి భూమన్‌, పుస్తక పరిచయం పి.సి.వెంకటేశ్వర్లు. సభలో వై. సుభాషిణి, ఆర్‌.సి. కృష్ణస్వామిరాజు, పల్లిపట్టు నాగరాజు, పాల్గొంటారు.

తోట వెంకటేశ్వర్లు

తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాలు

తెలంగాణ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కారా లకు సూచనలు, గ్రంథాలు ఆహ్వానిస్తున్నాం. 2022, 2023 సంవత్సరాల్లో తొలిసారి ముద్రితమైన పుస్తకా లను పంపాలి. పద్య/ గేయ కవిత్వం, వచన కవిత్వం, కథ, నవల, సాహిత్య విమర్శ, ఇతరాలు, యువ పురస్కారం అనే ఏడు విభాగాల్లో పురస్కా రాలు ఉంతాయి. పోటీకి పంపేవారు జన్మతః తెలంగాణ వారై ఉండాలి. పుస్తకాలు కవిత్వం 60, మిగతా ప్రక్రియల్లో 100 పుటలకు తక్కువ కాకుండా మూడు ప్రతుల చొప్పున ఏప్రిల్‌ 25లోగా తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్డు, ఆబిడ్స్‌, హైదరా బాద్‌-1 కు పుస్తకాలను పంపాలి. ఈమెయిల్‌ ్ట్ఛజ్చూుఽజ్చుఽ్చట్చట్చటఠ్చ్టీజ్చిఞ్చటజీటజ్చ్టిజిఃజఝ్చజీజూ.ఛిౌఝ కి పుస్తకం వివరాలు ముఖ్యంగా పుస్తకం పేరు, రచ యిత పేరు, ముద్రణ పొందిన సంవత్సరం, పుటల సంఖ్య పేర్కొంటూ సూచనలు పంపవచ్చు. 20 - 35 ఏళ్ల మధ్య వయసున్న వారు యువ పురస్కారం కోసం తమ రచనల్ని మూడేసి ప్రతుల చొప్పున పంపాలి. వివరాలకు: 9603727234.

తెలంగాణ సారస్వత పరిషత్తు

‘పలకల నుంచి పలుకుల వైపు’

తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు మార్చ్‌ 24న బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఉ.10గంటల నుంచి ఒక రోజంతా సాహిత్య సభలను మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ సభలను ప్రారంభిస్తారు. కందుకూరి శ్రీరాములు ‘పలకల నుంచి పలుకుల వైపు’ కవితా సంపుటిని ముఖ్య అతిథి శివారెడ్డి ఆవిష్కరిస్తారు. విశిష్ట అతిథులు నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌; ఆత్మీయ అతిథులు నాళేశ్వరం శంకరం, విరహత్‌ అలీ. రెండో విభాగంలో ‘సాహిత్యం సమకాలీనత’ అంశంలో కవిత్వం మీద దర్భశయనం శ్రీనివాసాచార్య, కథ - నవల మీద ఎన్‌.రజని, విమర్శ - పరిశోధన మీద లక్ష్మణ చక్రవర్తి ప్రసంగిస్తారు. మూడో విభాగంలో 38 కవులు పాల్గొంటున్న కవిసమ్మేళనం జరుగుతుంది.

బెల్లంకొండ సంపత్‌ కుమార్‌

Updated Date - Mar 18 , 2024 | 06:19 AM