Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 03 2024

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:43 AM

వర్తన రెండవ సమావేశం, ఉమ్మడిశెట్టి అవార్డు, పెన్నా సాహిత్య పురస్కారం, రచనలకు ఆహ్వానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 11 03 2024

వర్తన రెండవ సమావేశం

వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో రెండవ సమావేశం మార్చి 17 ఉ.10.30గంటలకు రవీంద్రభారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది. ‘కవిత్వ వాస్తవికత’ అనే అంశంపై కవి సిద్ధార్థ ప్రసంగిస్తారు. అధ్యక్షత రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

ఉమ్మడిశెట్టి అవార్డు

36వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డుకు 2023 సంవత్సరానికి బండి సత్యనారాయణ కవిత్వ సంపుటి ‘ఒంటి కాలు పరుగు’ ఎంపికైంది.

సుంకర గోపాలయ్య

పెన్నా సాహిత్య పురస్కారం

పెన్నా సాహిత్య పురస్కారం 2023 సంవత్సరానికి వశిష్ట సోమేపల్లి కవిత్వ సంపుటి ‘ఆకు రాలినచప్పుడు’ ఎంపికైంది. త్వరలో జరిగే పెన్నా రచయితల సంఘం వార్షికోత్సవ సభలో పురస్కార ప్రదానం ఉంటుంది.

అవ్వారు శ్రీధర్‌ బాబు

రచనలకు ఆహ్వానం

మక్కెన రామ సుబ్బయ్య కథా పురస్కారం, నెల్లుట్ల కవితా పురస్కారం, కె.వి. రావు కవితా ప్రక్రియ పురస్కారం (మినీ కవితలు, గజల్స్‌, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు), సాహితీ పురస్కారం (సమీక్ష/ విమర్శ), బాలసాహిత్య పురస్కారం (కథ, కవిత, గేయం), విజ్ఞాన - మనోవైజ్ఞానిక పుస్తక పురస్కారం... ఈ విభాగాల్లో రచయితలు 2023లో ప్రచురించిన పుస్తకాలు మూడేసి ప్రతులను ఏప్రిల్‌ 8లోగా చిరునామా: మక్కెన శ్రీను, అసోసియేట్‌ డీన్‌, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌, గరివిడి, విజయ నగరం జిల్లా - 535 101, ఎ.పి.కు పంపాలి. పురస్కార గ్రహీతలకు రూ.7000 నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కారం ఉంటుంది.

మక్కెన శ్రీను

Updated Date - Mar 11 , 2024 | 01:43 AM