Share News

బోధనేతర పనులతో ఒత్తిడి!

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:37 AM

ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్‌లైన్ హాజరు, మరుగుదొడ్లు ఫోటోలు తీయడం, మధ్యాహ్న భోజనం, రాగి జావ, చిక్కీలు, కోడిగుడ్ల లెక్కలు...

బోధనేతర పనులతో ఒత్తిడి!

ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్‌లైన్ హాజరు, మరుగుదొడ్లు ఫోటోలు తీయడం, మధ్యాహ్న భోజనం, రాగి జావ, చిక్కీలు, కోడిగుడ్ల లెక్కలు వంటి పనులను ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నారు. ఇవికాక ప్రాథమిక విద్యనభ్యసించే మూడో తరగతి విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు కలపడం, ప్రోగ్రెస్ రిపోర్టులు, ఏకరూప దుస్తులు, నాడు–నేడు, అమ్మ ఒడి వంటి పనులు చెబుతున్నారు. సకాలంలో పుస్తకాలు రాకపోవడం, తల్లిదండ్రులతో సమావేశాలు, మండల, జిల్లా అధికారులతో తరచూ చర్చలు వంటి ఇతర పనులతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురౌతున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తొలగిస్తే, వారు బోధనపై దృష్టి సారించి పాఠశాలల్లో అధిక ఉత్తీర్ణత సాధించి సత్తా చూపుతారు.

యర్రమోతు ధర్మరాజు

Updated Date - Apr 25 , 2024 | 02:37 AM