Share News

సమ తరంగధైర్ఘ్యం

ABN , Publish Date - Jan 01 , 2024 | 03:36 AM

ఒకరు కళ్ళు తెరచి ఓ దృశ్యం చూస్తారు కాదు కాదు దర్శిస్తారు అది మనసులో ఇంకే దాకా కనులు మూస్తారు తర్వాతే కాగితమ్మీద తెరచుకుంటారు...

సమ తరంగధైర్ఘ్యం

ఒకరు

కళ్ళు తెరచి ఓ దృశ్యం చూస్తారు

కాదు కాదు దర్శిస్తారు

అది

మనసులో ఇంకే దాకా

కనులు మూస్తారు

తర్వాతే

కాగితమ్మీద తెరచుకుంటారు

ఒకరు

కళ్ళు తెరచి దాన్ని చదువుతారు

తన మనసులో

అది ఇంకే దాకా

కనులు మూస్తారు

కవి పాదాలు రాస్తూ

ఓ రాస్తా వేస్తే

చదువరి తెరువరై

ఆ దారిని పవిత్రం చేస్తాడు

నలిమెల భాస్కర్‌

Updated Date - Jan 01 , 2024 | 03:36 AM