Share News

‘గద్దర్ అవార్డ్‌’పై రౌండ్ టేబుల్ సమావేశం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:46 AM

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డ్‌ను గద్దర్ అవార్డ్‌గా ప్రకటించారు. ఇది చాలా సముచిత నిర్ణయంగా మేం భావిస్తున్నాం. అలాగే సినీ ప్రముఖులు....

‘గద్దర్ అవార్డ్‌’పై రౌండ్ టేబుల్ సమావేశం

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నంది అవార్డ్‌ను గద్దర్ అవార్డ్‌గా ప్రకటించారు. ఇది చాలా సముచిత నిర్ణయంగా మేం భావిస్తున్నాం. అలాగే సినీ ప్రముఖులు సైతం దీనిని స్వాగతించారు. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ధృవతార గద్దర్. ఆయన చేసిన ఐదు దశాబ్దాల కృషికి ఇది సరైన గౌరవం. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నేటి ఉదయం పది గంటలకు కవులు, కళాకారులు, మేధావులు, సినీరంగ ప్రముఖులు, ప్రజా సంఘాలను కలుపుకొని ‘‘గద్దర్ అవార్డ్‌–సినీ ఇండస్ట్రీ అవుట్ లుక్’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. పసునూరి రవీందర్ అధ్యక్షత వహించే ఈ సమావేశంలో ప్రముఖ రచయిత ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్, జేబీ రాజు, బి. నర్సింగరావు, ఎన్. శంకర్, సుద్దాల అశోక్ తేజ, పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య, విమలక్క, రియాజ్, కొల్లూరి భరత్, చీమ శ్రీనివాస్, ఎం.ఎం. రహమాన్, కందుకూరి రమేష్ బాబు తదితరులు పాల్గొంటారు.

గద్దర్ గళం

Updated Date - Feb 13 , 2024 | 12:46 AM