Share News

‘దెంచనాల’కు జీవనసాఫల్య పురస్కారం

ABN , Publish Date - May 26 , 2024 | 03:44 AM

విశ్వకర్మ నాలెడ్జ్‌ సెంటర్‌ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నేటి సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం...

‘దెంచనాల’కు జీవనసాఫల్య పురస్కారం

విశ్వకర్మ నాలెడ్జ్‌ సెంటర్‌ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నేటి సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్‌ హాలులో విశ్వకర్మ లెజండరీ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత కవి, ఆధునికానంతర రంగస్థల దర్శకుడు, నటుడు, దృశ్యకాల్పనికుడు, కవిత్వ–రంగస్థల శిక్షణ గురువు, విమర్శకుడు, జనపదం ఆధునిక సంచార నాటక సంస్థ (రిపర్టరీ) వ్యవస్థాపక దర్శకులు దెంచనాల శ్రీనివాస్‌కు జీవనసాఫల్య పురస్కారం అందిస్తారు.

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

విశ్వనాథుల పుష్పగిరి

వ్యవస్థాపక అధ్యక్షులు,

విశ్వకర్మ నాలెడ్జ్‌ సెంటర్‌

Updated Date - May 26 , 2024 | 03:44 AM