Share News

కాష్ఠం రగులుకుంది

ABN , Publish Date - May 20 , 2024 | 03:15 AM

నీటిలో సూర్యబింబాన్ని చూసినట్టు రొట్టెలపై అమ్మను చూసుకున్నాడు పసిపిల్లాడు...

కాష్ఠం రగులుకుంది

నీటిలో సూర్యబింబాన్ని చూసినట్టు

రొట్టెలపై

అమ్మను చూసుకున్నాడు పసిపిల్లాడు

నీటిలో చంద్రబింబాన్ని చూసినట్టు

రొట్టెలపై

ప్రియురాలి మోమును చూసుకున్నాడొక ప్రియుడు

ఆ రెండు హృదయాలు

దొగ్గాడుతూ రొట్టెను అందుకునేలోపే

కాష్టం రగులుకుంది

ఇక అమ్మ లేదు, ప్రియురాలు లేదు,

రొట్టెలు రొట్టెల్లా లేవు. అంతా బూడిదే.

దుఃఖంతో, ఆకలి కేకలతో,

గాజా గుండెలు రగులుతుంటే

ఆ పసిహృదయాల పేగులు మండుతుంటే

సూర్యగోళం సైతం చిన్నబోయింది!

పేగులు పటపటమనే శబ్దానికి

ఉరుముల సత్తువ సన్నబోయింది!

దొంతం చరణ్‌

90002 15466

Updated Date - May 20 , 2024 | 03:15 AM