గోవింద...గోవింద...
ABN , Publish Date - Sep 24 , 2024 | 01:33 AM
నీలమేఘ శ్యామ! నిన్ను వేడెదమయ్య! పాపభీతి లేని పాలకులును! లడ్డు కల్తి జేయ లజ్జ లేకుండను! శిక్ష వేయరావ! శ్రీనివాస!...
నీలమేఘ శ్యామ! నిన్ను వేడెదమయ్య!
పాపభీతి లేని పాలకులును!
లడ్డు కల్తి జేయ లజ్జ లేకుండను!
శిక్ష వేయరావ! శ్రీనివాస!
శేషతల్పవాస! శ్రీ వెంకటేశుడా!
యోగనిద్రలోన పాగ వేయ!
నీదులడ్డుకల్తినిక్కమేజేసిరి!
శిక్ష వేయ లేవ! శ్రీనివాస!
నమ్మకాల నన్ని నట్టేట ముంచియు!
భక్తి భయము లేక బరితెగించి!
మానవత్వమంత మంటను గలిపిరి!
శిక్ష వేయ రావ! శ్రీనివాస!
కనకయ్య మల్లముల