Share News

ప్రతి మనిషి ఒక కొత్త పుస్తకమే

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:34 AM

చదివే స్ఫురద్రూపి ఉండాలే కానీ మనిషి కూడా ఒక పుస్తకమే మనిషిని చదవాలి రోజుకో పేజీ చొప్పున అచ్చయ్యే అనుభవాల సరికొత్త సంకలనమే పుస్తకం...

ప్రతి మనిషి ఒక కొత్త పుస్తకమే

చదివే స్ఫురద్రూపి ఉండాలే కానీ

మనిషి కూడా ఒక పుస్తకమే

మనిషిని చదవాలి

రోజుకో పేజీ చొప్పున అచ్చయ్యే

అనుభవాల సరికొత్త సంకలనమే పుస్తకం

కన్నీటి అక్షరాలు చిరునవ్వుల పదాలు

కష్టసుఖాల వాక్యాలు నిండిన గ్రంథమే మనిషి

ఎన్నో ఆశల్ని ఆశయాలనీ స్వప్నించిన మహాకావ్యం

బతుకు జలధిలో ఎగిసిపడే కెరటాలు, బంధాల గంధాలను రాసుకొనే పర్యాయాలు, మాటలు మంత్రాలను పాటించే ఆత్మీయతలు, చిరునవ్వుల సిరుల్ని మార్చుకొనే పరిచయాలు...

నవరసాల నిత్య నూతన నాటకం మనిషి

నూరేళ్ల పుస్తకాన్ని నిండు మనసుతో చదవాలి

ప్రతి అక్షరానికి సరికొత్త అర్థాల సంచయం జరగాలి

మనిషితో ఎదుగుతున్న...

నానా జంతుజీవజాతుల జ్ఞానాన్వేషణలో

తక్షణం మనిషిని చదవాలి

మనిషే కదా మహాకావ్యం

అందుకే మనిషిని చదవాలి

తప్పనిసరిగా మనిషి పుస్తకం చదవాలి

ఈతకోట సుబ్బారావు

Updated Date - Apr 23 , 2024 | 03:34 AM