Share News

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌

ABN , Publish Date - Sep 28 , 2024 | 12:17 AM

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ అన్నారు. అర్హుడైన ప్రతి చేనేత కార్మికుడికి విద్యుత సబ్సిడీ, వర్క్‌షెడ్‌ పథకాలను అందేలా చేస్తామన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌
ప్రజాసమస్యలను పరిష్కరిస్తాం

ధర్మవరం, సెప్టెంబరు 27: ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ అన్నారు. అర్హుడైన ప్రతి చేనేత కార్మికుడికి విద్యుత సబ్సిడీ, వర్క్‌షెడ్‌ పథకాలను అందేలా చేస్తామన్నారు. శుక్రవారం స్థానిక గాంధీనగర్‌ టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన పాలనలో ప్రజలు సమస్యలతో విసిగిపోయారని, ప్రస్తుతం ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రైతు, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు చింతలపల్లి మహేశ చౌదరి, పరిశే సుధాకర్‌, పురుషోత్తం గౌడ్‌, బీమనేని ప్రసాద్‌ నాయుడు, అంబటి సనత, మాధవరెడ్డి, బీరే శ్రీనివాసులు చట్టా లక్ష్మీనారాయణ, కేశగాళ్ల శీనా పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 12:17 AM