Share News

నేడు, రేపు భారత్‌ బచావో సదస్సు

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:54 AM

భారత్‌ బచావో అఖిలభారత విద్యార్థుల సదస్సు ఫిబ్రవరి 25, 26 తేదీలలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. భారత స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాల ఆశయాల...

నేడు, రేపు భారత్‌ బచావో సదస్సు

భారత్‌ బచావో అఖిలభారత విద్యార్థుల సదస్సు ఫిబ్రవరి 25, 26 తేదీలలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. భారత స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాల ఆశయాల సాధనలో భాగంగా జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి, ఫీజుల పెంపును వ్యతిరేకించాలి, ఉమ్మడి శాస్త్రీయ విద్యావిధానాన్ని అమలు చేయాలి, విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వోద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి, విశ్వవిద్యాలయాల్లో లింగ, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలి, స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్‌ల పునరుద్ధరణ, పెంపులను అమలు చేయాలి, క్యాంపస్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే డిమాండ్లతో ఈ సదస్సు జరుగుతోంది. మనోరంజన్‌ మహంతి, హరగోపాల్‌, అన్వర్‌ఖాన్‌, జస్టిస్‌ కోల్సీ పాటిల్‌, రాంపునియాని, లక్ష్మీనారాయణ, పద్మజా షా, అనితా రాంపాల్‌, మధుప్రసాద్‌, నిరంజన్‌ ఆరాధ్య, పిఎల్‌ విశ్వేశ్వరరావు, తిరుమలి ఇనుకొండ, దాసోజు లలిత, జెబి రాజు, విమలక్క, కె.శ్రీనివాస్‌, ఆకునూరి మురళి, పాశం యాదగిరి తదితరులు ప్రసంగిస్తారు.

అఖిలభారత

విశ్వవిద్యాలయాల విద్యార్థులు

Updated Date - Feb 25 , 2024 | 01:54 AM