Share News

‘ఆశయాలను అమలుచేయాలి’

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:44 AM

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించడం...

‘ఆశయాలను అమలుచేయాలి’

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించడం బాధాకరం. రైతుల కోసం వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేసి అధిక దిగుబడులు వచ్చే విధంగా అహర్నిశలు కష్టపడి ఎన్నో సేవలను ఆయన అన్నదాతలకు అందించాడు. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సిఫారసులు, సూచనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేయడంలేదు. పంట సాగు కోసం కర్షకులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ కొన్ని సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంకా పలు సూచనలు చేసినా, వాటిని అమలు చేయకుండా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రైతులు పంటలు సాగు చేయడానికి వేసే విత్తనాల దగ్గర్నుంచి కూలీల ఖర్చు, ఎరువుల ధరలు ప్రతి ఏటా పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. దీనికి తోడు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం పని చేసిన వారికి పురస్కారాలు ప్రకటించి, ప్రభుత్వాలు చప్పట్లు కొట్టి చేతులు దులుపుకోకుండా వారి ఆశయాల అమలుకు కృషి చేయాలి. అప్పుడే మహనీయులు చేసిన సేవలకు సార్థకత చేకూరుతుంది.

కె. శ్రావణ్

Updated Date - Feb 13 , 2024 | 12:44 AM