Share News

పోరాట మార్గాలన్నీ మన చేతిలోనే!

ABN , Publish Date - May 30 , 2024 | 01:03 AM

పాలకుల సేవలో తరిస్తున్న రాజ్యాంగవ్యవస్థలు ఇప్పుడు మతం ముసుగులో నియంతల అధికారమే మతం, నిలదీసి ప్రశ్నిస్తూ ప్రతిఘటించే సామూహిక స్వరాల స్వేచ్ఛానినాదం మరోవైపు,...

పోరాట మార్గాలన్నీ మన చేతిలోనే!

పాలకుల సేవలో

తరిస్తున్న రాజ్యాంగవ్యవస్థలు

ఇప్పుడు మతం ముసుగులో

నియంతల అధికారమే మతం,

నిలదీసి ప్రశ్నిస్తూ ప్రతిఘటించే

సామూహిక స్వరాల

స్వేచ్ఛానినాదం మరోవైపు,

ఎదురుగా దైవభాషలో

బుసలు కొడుతున్న శిక్షాస్మృతి!

న్యాయం కోరే ప్రజాశక్తుల

చీలికల దారుల్లో

ప్రజాబలం లేని యుద్ధతంత్రంలో

నిష్ఫలమవుతున్న త్యాగాల పరంపర;

నడుస్తున్న చరిత్రకు

ఆమోదముద్ర వేస్తున్న పాక్షిక జనం,

విగ్రహాల మందిరాల నిర్మాణంలో

నింగికెగిరిన పసిడితో మైమరిచే

‘ఇన్‌క్రెడిబిల్‌’ సనాతన ‌భారత్‌!

స్వేచ్ఛా సమతాసమధర్మ సాధనలో

ఈ అసమగ్ర అసమ ప్రజాస్వామ్యం–

ఆసాంతం మారేదాకా

పోరాట మార్గాలన్నీ

మన చేతిలోనే!?

– నిఖిలేశ్వర్‌

Updated Date - May 30 , 2024 | 01:03 AM