Share News

Hyderabad: వరకట్న వేధింపుల కేసులో ఎస్‌ఐకి జైలు.. కింది కోర్టులో వేసిన శిక్ష పైకోర్టులో ఖరారు

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:36 PM

వరకట్నం వేధింపుల కేసులో ఎస్‌ఐ మల్లుల సతీశ్‌ కుమార్‌కి దిగువ కోర్టు వేసిన శిక్షను పైకోర్టు ఖరారు చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన శిరీషతో హైదరాబాద్‌(Hyderabad)లో ఎస్‌ఐగా

Hyderabad: వరకట్న వేధింపుల కేసులో ఎస్‌ఐకి జైలు.. కింది కోర్టులో వేసిన శిక్ష పైకోర్టులో ఖరారు

రాజమహేంద్రవరం: వరకట్నం వేధింపుల కేసులో ఎస్‌ఐ మల్లుల సతీశ్‌ కుమార్‌కి దిగువ కోర్టు వేసిన శిక్షను పైకోర్టు ఖరారు చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన శిరీషతో హైదరాబాద్‌(Hyderabad)లో ఎస్‌ఐగా పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన మల్లుల సతీశ్‌ కుమార్‌కు 2014లో వివాహమైంది. పెళ్లయిన తొమ్మిది రోజులకే అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులు ఆరంభమయ్యాయి. దీంతో తనను వేధిస్తున్నారంటూ శిరీష రాజమహేంద్రవరం పోలీసులను ఆశ్రయించారు. కేసు విచారించిన రాజమహేంద్రవరంలోని 5వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 2018లో సతీశ్‌కి ఐదేళ్లు, అతడి తల్లి విజయ శారదకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతడిని ఎస్‌ఐ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. శిక్ష పడిన ఎస్‌ఐ రాజమహేంద్రవరం(Rajamahendravaram)లోని పదో అదనపు జిల్లా కోర్టులో అప్పీల్‌ చేశారు. వాదోపవాదాలు విన్న కోర్టు కింది కోర్టు వేసిన శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. బాధితురాలి తరఫున బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటరత్నంబాబు వాదనలు వినిపించారు.

Updated Date - Feb 28 , 2024 | 01:36 PM