పేటీఎం మూవీస్, ఈవెంట్స్‌పై జొమాటో కన్ను
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:14 AM
ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ పేటీఎంకు చెందిన మూవీస్, ఈవెంట్స్ వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సన్నాహాలు చేస్తోంది...

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ పేటీఎంకు చెందిన మూవీస్, ఈవెంట్స్ వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పేటీఎంతో చర్చలు జరుపుతున్నట్లు స్టాక్ మార్కెట్లకు పంపిన ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి చర్చలు మాత్రమే సాగిస్తున్నామని, బోర్డు దృష్టికి ఇంకా ఈ అంశాన్ని తీసుకువెళ్లాల్సి ఉందని పేర్కొంది. ప్రస్తుత వ్యాపారాలపై మరింతగా దృష్టి పెట్టడమే కాకుండా కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలన్న యోచనకు అనుగుణంగా ఈ చర్చలు సాగిస్తున్నట్లు జొమాటో తెలిపింది.