Share News

టాలెంట్‌ హబ్‌గా హైదరాబాద్‌

ABN , Publish Date - May 30 , 2024 | 02:01 AM

హైదరాబాద్‌తోపాటు నవీ ముంబై, పుణె నగరాలు క్రియాశీల నిపుణులకు కేంద్రాలుగా మారాయని అంతర్జాతీయ వృత్తి నైపుణ్య సేవల సంస్థ కేపీఎంజీ అంటోంది. భారత్‌లో...

టాలెంట్‌ హబ్‌గా హైదరాబాద్‌

క్రియాశీల నిపుణుల కేంద్రంగా

ఎదిగిన భాగ్యనగరం

ముంబై: హైదరాబాద్‌తోపాటు నవీ ముంబై, పుణె నగరాలు క్రియాశీల నిపుణులకు కేంద్రాలుగా మారాయని అంతర్జాతీయ వృత్తి నైపుణ్య సేవల సంస్థ కేపీఎంజీ అంటోంది. భారత్‌లో నిపుణుల లభ్యతకు సంబంధించి బుధవారం విడుదల చేసిన టాలెంట్‌ ఫీజిబిలిటీ రిపోర్టులో సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. కంపెనీలు, రిక్రూటర్లకు క్లిష్టమైన నైపుణ్యాలు కలిగిన విభిన్న ప్రతిభావంతులను అందించే కేంద్ర బిందువులుగా ఈ మూడు నగరాలు ఎదిగాయని నివేదికలో పేర్కొంది. భారత జాబ్‌ మార్కెట్‌ గణనీయ మార్పులకు లోనవుతోందని, మెట్రో నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి, శాటిలైట్‌ నగరాలూ (నవీ ముంబై, గురుగ్రామ్‌, నోయుడా) నిపుణుల అడ్డాలుగా ఎదుగుతున్నాయంటోంది. దాంతో కంపెనీలు తమ కార్యకలాపాలను మెట్రోలను దాటి విస్తరిస్తున్నాయని రిపోర్టులో ప్రస్తావించింది. నిపుణుల లభ్యత, ప్రభుత్వ మద్దతు, మౌలికాభివృద్ధి, నిర్వహణ వ్యయం, మార్కెట్‌ సత్తా వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయంది.

Updated Date - May 30 , 2024 | 02:01 AM