Share News

పవర్‌మెక్‌కు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ఆర్డర్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:34 AM

పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.232.03 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వాటిలో రూ.52.74 కోట్ల విలువ గల యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ఆర్డర్‌ కింద యాదాద్రి ప్రాజెక్టు కోసం...

పవర్‌మెక్‌కు యాదాద్రి థర్మల్‌ పవర్‌ ఆర్డర్‌

హైదరాబాద్‌: పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.232.03 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వాటిలో రూ.52.74 కోట్ల విలువ గల యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ఆర్డర్‌ కింద యాదాద్రి ప్రాజెక్టు కోసం సూపర్‌ స్ట్రక్చర్‌ పవర్‌ హౌస్‌, బంకర్‌ ప్రాంతం నిర్మించడంతో పాటు ప్లాంట్‌ పరిధిలోని ఇతర పనులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ నుంచి వేర్వేరు ప్రాజెక్టులకు సంబంధించి మూడు ప్యాకేజీలుగా రూ.122.89 కోట్ల ఆర్డర్లు లభించా యి. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లభించిన ప్యాకేజీల్లో ఒడిశాలోని తాల్చేర్‌లో ఎన్‌టీపీసీ కోసం ఒక్కోటి రూ.660 మెగావాట్ల విలువ గల రెండు యూనిట్ల (1,2 యూనిట్లు) నిర్మాణం ఒకటి కాగా ఎన్‌టీపీసీ తాల్చేర్‌ ప్రాజెక్టులో యాష్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ స్ట్రక్చర్‌, టాంక్‌ ఫ్యాబ్రికేషన్‌ మరొకటి. ఇవి కాకుండా ప్యాకేజీ-సీ కింద తాల్చేర్‌ ప్లాంట్‌లోనే కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ నిర్మించాల్సి ఉంటుంది.

Updated Date - Apr 19 , 2024 | 02:34 AM