Share News

తమిళనాడులో విన్‌ఫా్‌స్ట ప్లాంట్‌ రూ.16,000 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:52 AM

వియత్నాంకు చెందిన విన్‌ఫా్‌స్ట ఆటో లిమిటెడ్‌ విద్యుత్‌ కార్లు, బ్యాటరీ తయారీ కంపెనీ ప్లాంట్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు.

తమిళనాడులో విన్‌ఫా్‌స్ట ప్లాంట్‌ రూ.16,000 కోట్ల పెట్టుబడి

చెన్నై: వియత్నాంకు చెందిన విన్‌ఫా్‌స్ట ఆటో లిమిటెడ్‌ విద్యుత్‌ కార్లు, బ్యాటరీ తయారీ కంపెనీ ప్లాంట్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు. తూత్తుకుడిలో నిర్మించే ఈ ప్లాంట్‌పై కంపెనీ రూ.16,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఎంఓయూపై సంతకాలు చేసిన 50 రోజుల వ్యవధిలోనే ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. తమిళనాడులో పెట్టుబడుల అనుకూల వాతావరణానికి ఇది నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లాంట్‌లో 10 వేలకు పైబడి ఉద్యోగాలు లభిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. తొలి దశలో వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.4,000 కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ దశలో 3,500 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ఏడాదికి లక్షన్నర వాహనాల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుంది.

Updated Date - Feb 26 , 2024 | 03:52 AM