Share News

మార్కెట్లపై పశ్చిమాసియా దెబ్బ

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:53 AM

పశ్చిమాసియా సంక్షోభం మరోసారి తీవ్రరూపం దాల్చడంతో సోమవారం ఈక్విటీ మార్కెట్‌ను భారీ నష్టాల బాటలో నడిపింది. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలు కూడా ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి...

మార్కెట్లపై పశ్చిమాసియా దెబ్బ

  • సెన్సెక్స్‌ 845 పాయింట్లు డౌన్‌

  • రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: పశ్చిమాసియా సంక్షోభం మరోసారి తీవ్రరూపం దాల్చడంతో సోమవారం ఈక్విటీ మార్కెట్‌ను భారీ నష్టాల బాటలో నడిపింది. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలు కూడా ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. విదేశీ నిధులు తరలిపోవడం, అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉండడం కూడా సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 845.12 పాయింట్ల నష్టంతో రెండు వారాల కనిష్ఠ స్థాయి 73,399.78 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 929.74 పాయింట్లు నష్టపోయి 73,315.16 వరకు దిగజారింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 246.90 పాయింట్ల నష్టంతో 22,272.50 వద్ద స్థిరపడింది. సూచీలు నష్టపోవడం ఇది వరుసగా రెండో సెషన్‌. ఈ రెండు సెషన్లలో సెన్సెక్స్‌ 1,638 పాయింట్లు, నిఫ్టీ 481 పాయింట్లు నష్టపోయాయి. సోమవారం నాటి భారీ పతనంతో బీఎ్‌సఈలో లిస్టింగ్‌ అయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.5,18,953.97 కోట్ల మేరకు దిగజారి రూ.3,94,48,097.94 కోట్లకు (4.73 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

ఐపీఓకి దీపక్‌ బిల్డర్స్‌: ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగంలోని దీపక్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూ లో భాగంగా 1.2 కోట్ల తాజా ఈక్విటీ షేర్లు జారీ చేస్తారు. 24 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఓఎ్‌ఫఎస్‌ విధానంలో విక్రయిస్తారు. ఇష్యూ ద్వారా సేకరించే నిధులు రుణభారం తగ్గించుకోవడంతో పాటు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించుకోనున్నట్టు తెలిపింది.

ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ దూకుడు: కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుపై రూ.118 డివిడెండ్‌ ఇవ్వడానికి ఆమోదం తెలపడంంతో ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ షేరు 7.50 శాతం మేర లాభపడింది. ఈ షేరు బీఎ్‌సఈలో 7.13 శాతం లాభంతో రూ.522.75 వద్ద ముగియగా ఎన్‌ఎ్‌సఈలో 7.53 శాతం లాభంతో రూ.525 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో ఇంట్రాడేలో 14.41 శాతం మేరకు దూసుకుపోయి రూ.558.30 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

బంగారం మరో రూ.300 అప్‌: ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. సోమవారం 10 గ్రాముల బంగారం రూ.300 పెరిగి రూ.73,050 పలికింది. వెండి ధర కూడా రూ.500 పెరిగి కిలో రూ.85,700 పలికింది. అంతర్జాతీయ విపణిలో కామెక్స్‌లో స్పాట్‌ బంగారం ధర ఔన్సు 12 డాలర్లు పెరిగి 2,355 డాలర్లు పలికింది. వెండి కూడా ఔన్సు 28.25 డాలర్లు పలికింది.

Updated Date - Apr 16 , 2024 | 02:53 AM