Share News

అనుబంధ కంపెనీలనూ సొమ్ము చేసుకుంటాం

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:09 AM

అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ పేమెంట్‌ను సమయం వచ్చినప్పుడు సొమ్ము చేసుకుంటామని మాతృసంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది...

అనుబంధ కంపెనీలనూ సొమ్ము చేసుకుంటాం

న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ పేమెంట్‌ను సమయం వచ్చినప్పుడు సొమ్ము చేసుకుంటామని మాతృసంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. ఆ సంస్థ చైర్మన్‌ దినేశ్‌ ఖారా ఈ విషయం చెప్పారు. ఈలోగా ఈ రెండు కంపెనీల వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామన్నారు. ఈ లక్ష్య సాధన పూర్తయ్యాక క్యాపిటల్‌ మార్కెట్‌ ద్వారానే ఈ రెండు కంపెనీల ఈక్విటీలో ఎస్‌బీఐకి ఉన్న వాటాలో కొంత వాటా విక్రయించి సొమ్ము చేసుకుంటామని ఖారా చెప్పారు. అయితే ఇది ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం జరగదన్నారు. కాగా ప్రస్తుతం కంపెనీల నుంచీ రుణాలకు గిరాకీ పెరుగుతోందని ఖారా తెలిపారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలతో పాటు, ఉత్పత్తి విస్తరణ కోసమూ ప్రస్తుతం కంపెనీలు రుణాల కోసం తమను సంప్రదిస్తున్నట్టు చెప్పారు. ఈ రెండు రుణాల మొత్తమే రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుందన్నారు.

ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా

Updated Date - Jun 17 , 2024 | 04:09 AM