వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:41 AM
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో.. మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో విడుదల చేసింది. ఇది అత్యంత సన్నటి, తేలికైన, ఫోల్డబుల్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్ అని వివో తెలిపింది....

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో.. మార్కెట్లోకి మేడిన్ ఇండియా ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో విడుదల చేసింది. ఇది అత్యంత సన్నటి, తేలికైన, ఫోల్డబుల్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్ అని వివో తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 3 మొబైల్ ప్లాట్‌ఫామ్, 3 డీ అలా్ట్రసోనిక్ డ్యూయల్ స్ర్కీన్ ఫింగర్‌ప్రింట్ స్కానింగ్, హెచ్‌డీఆర్ 10ప్లస్, డాల్బీ విజన్, ఎక్స్‌డీఆర్ ఇంజన్, వివో జెడ్‌ఈఐఎస్‌ఎస్ కో-ఇంజనీర్డ్ ఇమేజింగ్ సిస్టమ్, అలా్ట్ర వైడ్ యాంగిల్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. 16 జీబీ ప్లస్ 512 జీబీ మెమొరీతో సెలెస్టియల్ బ్లాక్ కలర్‌తో అందుబాటులో ఉండనున్న ఈ ఫోన్ ధర రూ.1,59,999.