Share News

తగ్గిన విమ్టా ల్యాబ్స్‌ లాభం

ABN , Publish Date - May 19 , 2024 | 06:09 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2023 -24) మార్చితో ముగిసిన త్రైమాసికంలో విమ్టా ల్యాబ్స్‌ రూ.80.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.12.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది..

తగ్గిన విమ్టా ల్యాబ్స్‌ లాభం

హైదరాబాద్‌: గడచిన ఆర్థిక సంవత్సరం (2023 -24) మార్చితో ముగిసిన త్రైమాసికంలో విమ్టా ల్యాబ్స్‌ రూ.80.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.12.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోల్చితే లాభం స్వల్పం గా 2.6 శాతం తగ్గింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.322.30 కోట్ల ఆదాయంపై రూ.41 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.321.60 కోట్లుగా ఉండగా లాభం రూ.48.2 కోట్లుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రధమార్ధం తర్వాత చివరి త్రైమాసికంలో మంచి రికవరీని సాధించినట్లు విమ్టా ల్యాబ్స్‌ ఎండీ హరిత వాసిరెడ్డి తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ 2024-25లో మంచి పనితీరును కనబరచవచ్చని అంచనా వేస్తున్నట్లు హరిత చెప్పారు.

Updated Date - May 19 , 2024 | 06:09 AM