Share News

‘ఎన్‌ఆర్‌ఐ’లకూ యూపీఐ చెల్లింపుల సౌకర్యం

ABN , Publish Date - May 07 , 2024 | 03:05 AM

ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కోసం మరో ప్రత్యేక సౌలభ్యం కల్పించింది. వీరు ఇక తమ ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాలతో అనుసంధానమైన అంతర్జాతీయ మొబైల్‌ ఫోన్‌ నంబర్ల ద్వారా...

‘ఎన్‌ఆర్‌ఐ’లకూ యూపీఐ చెల్లింపుల సౌకర్యం

దుబాయ్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కోసం మరో ప్రత్యేక సౌలభ్యం కల్పించింది. వీరు ఇక తమ ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాలతో అనుసంధానమైన అంతర్జాతీయ మొబైల్‌ ఫోన్‌ నంబర్ల ద్వారా దేశంలో యూపీఐ చెల్లింపులను అప్పటికప్పుడు చేయవచ్చు. దీంతో తమ ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులు రోజువారీ చేసే యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, మర్చంట్‌ అండ్‌ ఈ-కామర్స్‌ లావాదేవీలు అత్యంత సౌకర్యవంతంగా మారతాయని బ్యాంక్‌ తెలిపింది. తమ ‘ఐమొబైల్‌ పే’ యాప్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. అమెరికా, బ్రిటన్‌, యూఏఈ, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియాలోని ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుందని బ్యాంక్‌ తెలిపింది.

Updated Date - May 07 , 2024 | 03:05 AM