Share News

నాలుగు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

ABN , Publish Date - May 16 , 2024 | 05:11 AM

ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల నడుమన ఎగుమతులు కేవలం ఒక శాతం పెరిగి 3499 కోట్ల డాలర్లుగా (రూ.2.97 లక్షల కోట్లు) నమోదయ్యాయి...

నాలుగు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

ఏప్రిల్‌ ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం ఏప్రిల్‌ నెలలో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల నడుమన ఎగుమతులు కేవలం ఒక శాతం పెరిగి 3499 కోట్ల డాలర్లుగా (రూ.2.97 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అయితే వాణిజ్య లోటు మాత్రం నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 1910 కోట్ల డాలర్లకు (రూ.1.62 లక్షల కోట్లు) చేరింది. గత ఏడాది ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 1444 కోట్ల డాలర్లుగా (రూ.1.23 లక్షల కోట్లు) ఉంది. గత ఏడాది డిసెంబరులో నమోదైన గరిష్ఠ స్థాయి 1980 కోట్ల డాలర్ల (రూ.1.68 లక్షల కోట్లు) తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయిలో ఉండడం ఇదే ప్రథమం. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎలక్ర్టానిక్స్‌, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతుల్లో ఆరోగ్యవంతమైన వృద్ధి చోటు చేసుకుంది. ఏప్రిల్‌లో దిగుమతులు కూడా 10.25 శాతం పెరిగి 5409 కోట్ల డాలర్లుగా (రూ.4.60 లక్షల కోట్లు) నమోదయ్యాయి. బంగారం దిగుమతులు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడింది.

Updated Date - May 16 , 2024 | 05:11 AM