Share News

నేటి ముఖ్యమైన వ్యాపార వార్తలు 29 03 2024

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:47 AM

హైదరాబాద్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌కు ఇండో డచ్‌ సైబర్‌సెక్యూరిటీ స్కూల్‌ (ఐడీసీఎ్‌సఎస్‌) నుంచి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది...

నేటి ముఖ్యమైన వ్యాపార వార్తలు 29 03 2024

  • హైదరాబాద్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌కు ఇండో డచ్‌ సైబర్‌సెక్యూరిటీ స్కూల్‌ (ఐడీసీఎ్‌సఎస్‌) నుంచి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఆపరేషనల్‌ థ్రెట్స్‌, ఇంటర్నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ అటాక్‌ వెక్టార్స్‌ చాలెంజ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఈ గుర్తింపును దక్కించుకుంది. తెలంగాణ ప్రభుత్వం, సైబర్‌ సెక్యూరిటీ సీఓఈ-డిజిటల్‌ సిగ్నేచర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీసీఎ్‌సఎస్‌ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

  • లూమినస్‌ వపర్‌ టెక్నాలజీస్‌.. ఉత్తరాఖండ్‌లో సోలార్‌ ప్యానల్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో కంపెనీ అత్యున్నత నాణ్యత గల సోలార్‌ మాడ్యూల్స్‌ను తయారు చేయనుంది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 250 మెగావాట్లుగా ఉంది. రుద్రపూర్‌లో నెలకొల్పిన ఈ ప్లాంట్‌ను కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రారంభించారు.

  • టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఏప్రిల్‌ 1 నుంచి ఎంపిక చేసిన కొన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నిర్వహణ వ్యయాలతో పాటు ఇన్‌పుట్‌ వ్యయాలు పెరిగిపోవటంతో ధరలను 1 శాతం మేర పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది.

  • టెక్స్‌టైల్స్‌, అపారెల్స్‌, లగ్జరీ ఉత్పత్తుల విభాగంలో 2023 సంవత్సరానికి గాను వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూఎల్‌ఎల్‌) అత్యుత్తమ ఈఎ్‌సజీ రేటింగ్‌ను సాధించింది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఈఎ్‌సజీ స్కోర్‌లో మొత్తంగా 66 స్కోర్‌ను సాధించినట్లు వెల్‌స్పన్‌ లివింగ్‌ తెలిపింది.

  • పర్యావరణ పరిరక్షణ కోసం కర్బన ఉద్గారాలను తగ్గించటంలో ఇంటర్‌సిటీ ట్రావెల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఫ్రెష్‌ బస్‌ ముందు వరుసలో ఉంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాలను తగ్గించటం కోసం క్లైమెట్‌ ఫైనాన్స్‌ కంపెనీ క్లైమ్స్‌తో జట్టు కట్టడం ఇందుకు ఎంతగానో కలిసివచ్చింది.

Updated Date - Mar 29 , 2024 | 02:47 AM