Share News

ఈ వారంలోనూ ఆటుపోట్లే

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:58 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గత రెండు వారాలుగా నష్టాల బాట పట్టింది. ఈ వారంలో కూడా సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో కొనసాగుతున్న బేరి్‌షనెస్‌, దిద్దుబాటు ఇందుకు కారణాలుగా ...

ఈ వారంలోనూ ఆటుపోట్లే

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గత రెండు వారాలుగా నష్టాల బాట పట్టింది. ఈ వారంలో కూడా సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో కొనసాగుతున్న బేరి్‌షనెస్‌, దిద్దుబాటు ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి ఈ వారం 21,000 పాయింట్ల వద్ద గట్టి మద్దతు కనిపిస్తోంది. మదుపరులు ఆకర్షణీయ ధరలో దొరుకుతున్న బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ కంపెనీల షేర్లపై దృష్టి పెట్టడం మంచిది.

ఈ వారం స్టాక్‌ రికమండేషన్లు

అంబుజా సిమెంట్స్‌: మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాతో ఈ కౌంటర్లో మూమెంటమ్‌ పెరుగుతోంది. గత వారం ఈ షేరు ధర ఏకంగా 6.2 శాతం పెరిగి రూ.560 వద్ద క్లోజైంది. రూ.625/660 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.550 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.530ని కచ్చితంగా స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

సంవర్థన్‌ మదర్సన్‌ లిమిటెడ్‌ : ఈ కౌంటర్లో గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన అప్‌ట్రెండ్‌కు ఈ ఏడాది జూలైలో తెర పడింది. ఆ తర్వాత ఈ కౌంటర్లో మంచి కన్సాలిడేషన్‌ జరిగింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయనే అంచనాతో ఈ కౌంటర్లో మళ్లీ అప్‌ట్రెండ్‌ కనిపిస్తోంది. గత వారం చివరి రెండు సెషన్స్‌లోనే ఈ కంపెనీ షేర్లు 12 శాతం పెరిగాయి. మదుపరులు రూ.140/165 టార్గెట్‌తో రూ.113-110 శ్రేణిలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.104ని గట్టి స్టాప్‌ లాస్‌గా పెట్టుకోవాలి.

బజాజ్‌ ఆటో: దిద్దుబాటుకు తావు లేకుండా ఈ కౌంటర్‌లో సుదీర్ఘ అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. దీంతో మదుపరులు ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. గురువారం ఏకంగా 5.33 శాతం లాభంతో రూ.7,210 వద్ద క్లోజైంది. రూ.7,850/7,950 టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.7,400/7,509 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.7,250ని స్ట్రిక్ట్‌ స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టాటా పవర్‌: సుదీర్ఘ కాలం దిద్దుబాటు తర్వాత టాటా పవర్‌ కౌంటర్లో స్థిరత్వం కనిపిస్తోంది. నిరుడు జూన్‌లో ప్రారంభమైన అప్‌ట్రెండ్‌ ఇంకా కొనసాగుతోంది. బడ్జెట్‌లో పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందనే అంచనాలూ ఇందుకు తోడయ్యాయి. శుక్రవారం రూ.365 వద్ద క్లోజైన ఈ కౌంటర్లో మదుపరులు రూ.390/410 టార్గెట్‌తో రూ.360 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.345ని గట్టి స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

పీఎన్‌బీ: ప్రస్తుతం ఈ బ్యాంకు షేర్లు పరుగులు పెడుతున్నాయి. జెఫరీస్‌ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడం ఇందుకు ప్రధాన కారణాలు. గత వారం రూ.104 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.115/135 టార్గెట్‌తో రూ.103 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. అయితే రూ.95ని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పాటించాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్ట్‌ మాస్టర్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - Jan 29 , 2024 | 05:59 AM