ఈసారి 9.5 శాతం వేతన పెంపు!
ABN , Publish Date - Feb 22 , 2024 | 06:11 AM
ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.5 శాతం పెరగవచ్చని అయాన్ పీఎల్‌సీ తాజా సర్వే నివేదిక అంచనా వేసింది. 2023లో 9.7 శాతం వేతన వృద్ధితో...
వెల్లడించిన అయాన్ సర్వే
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.5 శాతం పెరగవచ్చని అయాన్ పీఎల్‌సీ తాజా సర్వే నివేదిక అంచనా వేసింది. 2023లో 9.7 శాతం వేతన వృద్ధితో పోలిస్తే మాత్రం తక్కువేనని పేర్కొంది. కరోనా సంక్షోభం ముగిశాక 2022లో రెండంకెల ఇంక్రిమెంట్ల తర్వాత ఇండస్ట్రీలో జీతాల పెంపు ఏక అంకె స్థాయి వద్ద స్థిరపడిందని రిపోర్టు అభిప్రాయపడింది. 45 రంగాలకు చెం దిన 1,414 కంపెనీల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అగ్ర దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతన పెంపు అధికమని అంటోంది. ఈ ఏడాది సగటు వేతన వృద్ధిలో భారత్ తర్వాత స్థానంలో బంగ్లాదేశ్ (7.3 శాతం), ఇండోనేషియా (6.5 శాతం) ఉన్నాయి.