Share News

మే 31లోగా ఎలాంటి అదనపు భారం ఉండదు

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:25 AM

అసెసీలు మే 31 లోగా పాన్‌-ఆధార్‌ అనుసంధానత పొందే పక్షంలో వారిపై ఎలాంటి అదనపు పన్ను భారం ఉండదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది...

మే 31లోగా ఎలాంటి అదనపు భారం ఉండదు

సీబీడీటీ

న్యూఢిల్లీ: అసెసీలు మే 31 లోగా పాన్‌-ఆధార్‌ అనుసంధానత పొందే పక్షంలో వారిపై ఎలాంటి అదనపు పన్ను భారం ఉండదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎవరైనా పాన్‌, ఆధార్‌ అనుసంధానం చేసుకోకపోయినట్టయితే వారికి వర్తించే పన్నురేటుపై రెండింతలు పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం పై పన్ను చెల్లింపుదారుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం మార్చి 31లోగా పాన్‌, ఆధార్‌ అనుసంధానానికి దరఖాస్తు చేసుకుని ఉండి మే 31లోగా వారికి అనుమతి లభించే పక్షంలోవారిపై ఎలాంటి అదనపు పన్ను భారం వేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సీబీడీటీ తెలిపింది.

Updated Date - Apr 25 , 2024 | 05:25 AM