మార్కెట్ మళ్లీ లాభాల బాట
ABN , Publish Date - May 11 , 2024 | 04:46 AM
స్టాక్‌మార్కెట్ ఐదు రోజుల తర్వాత శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 260.30 పాయింట్ల లాభంతో 72,664.47 వద్ద, నిఫ్టీ 97.70 పాయింట్ల లాభంతో
ముంబై: స్టాక్‌మార్కెట్ ఐదు రోజుల తర్వాత శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 260.30 పాయింట్ల లాభంతో 72,664.47 వద్ద, నిఫ్టీ 97.70 పాయింట్ల లాభంతో 22,055.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 542.37 పాయింట్ల లాభంతో 72,946.54 గరిష్ఠ స్థాయిని తాకింది. సెన్సెక్స్ హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్‌టెల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది.
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అదుర్స్: శుక్రవారం ముగిసిన ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓకు వదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. బిడ్డింగ్ ప్రాసెస్ ముగిసే సరికి ఇష్యూ 25.49 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది.
జూ ఈ నెల 15న ఐపీఓకి వస్తున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు ధర శ్రేణిని రూ.258-272గా ప్రకటించింది.