Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఐపీఓ మార్కెట్‌ బిజీ బిజీ

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:58 AM

డేటా ఆధారిత సమగ్ర మార్కెటింగ్‌ సేవలు అందించే ఆర్‌కే స్వామి కంపెనీ ఐపీఓ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది.

 ఐపీఓ మార్కెట్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్‌ మరింత బిజీగా మారనుంది. రూ.1,483.2 కోట్లు సమీకరించేందుకు ఎనిమిది కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఓలు జారీ చేసిన ఏడు కంపెనీల షేర్లు ఈ వారం బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లిస్ట్‌ కాబోతున్నాయి.

ఈ వారం వస్తున్న ఐపీఓలు ఇవే..

డేటా ఆధారిత సమగ్ర మార్కెటింగ్‌ సేవలు అందించే ఆర్‌కే స్వామి కంపెనీ ఐపీఓ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల 6న ముగిసే ఈ ఐపీఓ ఇష్యూ ధరను రూ.270-288గా ఖరారు చేశారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.423.56 కోట్లు సమీకరించనుంది. జింక్‌ ఆక్సైడ్‌ తయారు చేసే జేబీ కెమికల్స్‌ ఐపీఓ మంగళవారం ప్రారంభమవుతోంది. రూ.250.2 కోట్ల సమీకరణ కోసం ఈ కంపెనీ రూ.210-221 ప్రైస్‌ బ్యాండ్‌లో షేర్లు జారీ చేస్తోంది. ఈ ఐపీఓ మార్చి 7న ముగుస్తుంది. రాజ్‌కోట్‌ కేంద్రంగా గోపాల్‌ స్నాక్స్‌ కూడా రూ.650 కోట్ల సమీకరణ కోసం ఈ నెల 6న ఐపీఓ జారీ చేస్తోంది. మార్చి 11న ముగిసే ఈ ఐపీఓ ఇష్యూ ధరను రూ.381-401గా నిర్ణయించారు.ఈ మూడు కంపెనీలు కాకుండా వీఆర్‌ ఇన్‌ఫ్రాస్పేస్‌, సోనా మెషినరీ, శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్‌, కౌరాఫైన్‌ డైమండ్‌ జువెలరీ, పుణె ఈ-స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీలూ ఈ వారం ఐపీఓ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. గత వారం ప్రారంభమైన ముక్కా ప్రొటీన్స్‌ ఐపీఓ సోమవారం ముగుస్తుంది. ఎంవీకే ఆగ్రో ఫుడ్‌ ప్రొడక్ట్‌ కంపెనీ ఐపీఓ కూడా సోమవారం ముగియనుంది.

ప్లాటినం ఇండస్ట్రీస్‌, ఎగ్జికామ్‌ టెలిసిస్టమ్స్‌ కంపెనీల షేర్లు మంగళవారం లిస్టవుతున్నాయి. ఈ రెండు కంపెనీల షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర కంటే 54 నుంచి 100 శాతానికిపైగా ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. భారత్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ షేర్లు బుధవారం, ముక్కా ప్రొటీన్స్‌ షేర్లు గురువారం లిస్టవుతాయి.ఇక ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో ఒయాసిస్‌ మెటల్‌ అండ్‌ మినరల్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ షేర్లు సోమవారం, పూర్వ్‌ ఫ్లెక్సిప్యాక్‌ కంపెనీ షేర్లు మంగళవారం, ఎంవీకే ఆగ్రో ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ షేర్లు గురువారం లిస్టవుతున్నాయి.

Updated Date - Mar 04 , 2024 | 03:58 AM