Share News

టెక్‌ వ్యూ : 23,000 వద్ద గట్టి పరీక్ష

ABN , Publish Date - May 27 , 2024 | 02:46 AM

నిఫ్టీ గతవారం 22,500 వద్ద పాజిటివ్‌ ట్రెండ్‌తో ప్రారంభమై మిగిలిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలోనూ ర్యాలీని కనబరిచింది. చివరకు తదుపరి మానసిక అవధి స్థాయి 23,000కు చేరుకుంది. నిఫ్టీ అంతకు ముందు వారం ముగింపుతో పోలిస్తే...

టెక్‌ వ్యూ : 23,000 వద్ద గట్టి పరీక్ష

టెక్‌ వ్యూ : 23,000 వద్ద గట్టి పరీక్ష

నిఫ్టీ గతవారం 22,500 వద్ద పాజిటివ్‌ ట్రెండ్‌తో ప్రారంభమై మిగిలిన నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలోనూ ర్యాలీని కనబరిచింది. చివరకు తదుపరి మానసిక అవధి స్థాయి 23,000కు చేరుకుంది. నిఫ్టీ అంతకు ముందు వారం ముగింపుతో పోలిస్తే గతవారం 455 పాయింట్ల (2 శాతం) లాభంతో పటిష్ఠంగా క్లోజైంది. నిఫ్టీ గత వారం అంతకు ముందు గరిష్ట స్థాయిలైన 22,800ను అధిగమించి సరికొత్త గరిష్ఠ స్థాయిల్లో ముగిసింది. అయితే గత శుక్రవారం 23,000 స్థాయిల్లో నిరోధాన్ని ఎదుర్కొంది. ట్రేడర్లు, స్వల్పకాలిక ఇన్వెస్టర్లు.. గరిష్ఠ స్థాయిల వద్ద అప్రమత్తంగా ఉండటం మంచిది. మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ కూడా 555 పాయింట్లు(1 శాతం) లాభపడింది. అయితే స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం 125 పాయింట్లు నష్టపోయి మైనర్‌ బలహీనతతో క్లోజైంది. కాగా టెక్నికల్‌గా చూస్తే పుల్‌ బ్యాక్‌ రియాక్షన్‌కు అవకాశం ఉండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. నిఫ్టీ ప్రస్తుత నిరోధ స్థాయిలైన 23,000 ఎగువన నిలదొక్కుకుంటేనే తదుపరి అప్‌ట్రెండ్‌ను సూచిస్తుందా లేదా సరికొత్త గరిష్ఠాలను తాకుతుందా లేదా అనేది తేలుతుంది.


బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ పాజిటివ్‌ ట్రెండ్‌ను కనబరిస్తే 23,000 ఎగువన తదుపరి నిరోధ స్థాయిలుంటాయి. (ఇది గత శుక్రవారం ఏర్పడిన స్థాయి). ప్రస్తుతం నిఫ్టీ ఈ స్థాయికి 50 పాయింట్ల దూరంలో ఉంది. అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి మానసిక నిరోధ స్థాయి 23,500.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే తదుపరి మద్దతు స్థాయి 22,900 దిగువన ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే తదుపరి మద్దతు స్థాయిలు 22,750 దిగువన ఉంటాయి. ఈ స్థాయిలు గతంలో (ఈ ఏడాది ఏప్రిల్‌ 10, మే 3) నిరోధ స్థాయిలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి మద్దతు స్థాయిలుగా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కూడా నిలదొక్కుకోలేని పక్షంలో 22,500 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి.


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ అప్‌ట్రెండ్‌ లో కొనసాగుతూ 49,000 ఎగువన క్లోజైంది. గత వారం బ్యాంక్‌ నిఫ్టీ 770 పాయింట్లు లాభపడినప్పటికీ ఇటీవలి గరిష్ఠ స్థాయిలకు దిగువనే ఉండటం గమనార్హం. ఈ వారం ఏదేనీ రికవరీ సాధిస్తే 49,300 వద్ద ప్రధాన నిరోధ స్థాయిలు ఉంటాయి. తదుపరి ప్రధాన నిరోధం 49,600. అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బలహీనతను సూచిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 48,600 వద్ద ఉంటాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది.

పాటర్న్‌: మార్కెట్‌ మరోసారి స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ పొజిషన్‌లోకి ప్రవేశించింది. అప్రమత్తంగా ఉండటం మంచిది. 23,000 వద్ద ఏటవాలుగా ఉన్న నిరోధ లైన్‌ వద్ద నిఫ్టీ బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. 22,750 వద్ద సమాంతరంగా ఉన్న లైన్‌ వద్ద తదుపరి మద్దతు స్థాయిలున్నాయి. ఈ సపోర్ట్‌ లైన్‌ వద్ద ఏదేనీ బ్రేక్‌డౌన్‌ను సూచిస్తే తదుపరి అప్రమత్తతను సూచిస్తుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం రివర్సల్‌ ఉండవచ్చు.

సోమ వారం స్థాయిలు

నిరోధం : 23,020, 23,075

మద్దతు : 22, 900, 22,860

వి. సుందర్‌ రాజా

Updated Date - May 27 , 2024 | 02:46 AM