టెక్ వ్యూ : 24,000 ఎగువన నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:24 AM
నిఫ్టీ గత వారం ప్రారంభంలో డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 23,300 కన్నా దిగజారినా శుక్రవారం ఏర్పడిన బలమైన రికవరీలో 560 పాయింట్ల మేరకు లాభపడింది. చివరికి గత వారంతో పోల్చితే 375 పాయింట్ల లాభంతో...
టెక్ వ్యూ : 24,000 ఎగువన నిలదొక్కుకోవడం కీలకం
నిఫ్టీ గత వారం ప్రారంభంలో డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ 23,300 కన్నా దిగజారినా శుక్రవారం ఏర్పడిన బలమైన రికవరీలో 560 పాయింట్ల మేరకు లాభపడింది. చివరికి గత వారంతో పోల్చితే 375 పాయింట్ల లాభంతో 23,900 సమీపంలో ముగిసింది. టెక్నికల్‌గా మార్కెట్ ఎనిమిది వారాల డౌన్‌ట్రెండ్ అనంతరం రిలీఫ్ ర్యాలీ సాధించింది. అయితే మార్కెట్ ఇప్పటికీ మద్దతు స్థాయిల కన్నా పైనే ఉంది. మార్కెట్ నిట్టనిలువుగా బౌన్స్‌బ్యాక్ సాధించినందు వల్ల స్పష్టమైన సందేశం ఇవ్వాలంటే కన్సాలిడేట్ కావడం తప్పనిసరి. అయితే ఈ రివర్సల్‌తో తక్షణ డౌన్‌ట్రెండ్ ముప్పును మాత్రం తప్పించుకుంది. కాగా గత వారం మిడ్‌క్యాప్-100 సూచీ 975 పాయింట్లు, స్మాల్‌క్యాప్-100 సూచీ 155 పాయింట్లు లాభపడ్డాయి. ఈ వారం లో నిఫ్టీ మరింత పాజిటివ్‌గానే ప్రారంభం కావచ్చు. ఈ క్రమంలో 24,000 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: మరింత పాజిటివ్ సంకేతం ఇవ్వాలంటే నిఫ్టీ తదుపరి నిరోధం 24,100 కన్నా పైన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయిలు 24,350, 24,550. ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు.
బేరిష్ స్థాయిలు: ఏ మాత్రం బలహీనత ప్రదర్శించినా మద్దతు స్థాయి 24,000 వద్ద కన్సాలిడేషన్ తప్పనిసరి. భద్రత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడవచ్చు. ప్రధాన మద్దతు స్థాయిలు 23,800, 23,500.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 950 పాయింట్ల మేరకు రికవరీ సాధించి చివరికి 51,000 కన్నా స్వల్పంగా పైన క్లోజైంది. మరింత సానుకూలత కోసం తదుపరి నిరోధం 51,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 52,200. ప్రస్తుత మద్దతు స్థాయి 51,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే బలహీనత సంకేతం ఇస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 49,400.
పాటర్న్: నిఫ్టీ గత వారం 200 డిఎంఏ వద్ద రికవరీ సాధించింది. ఇప్పుడు నిరోధ స్థాయి 24,100 సమీపంలో గల 25 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. మార్కెట్ గత వారం ఓవర్‌సోల్డ్ స్థితి నుంచి కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,000, 24,155
మద్దతు : 24,000, 23,920